Dussehra: దసరా స్పెషల్ ఆఫర్.. మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను మాఫీ చేసిన బ్యాంక్!
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) సేవింగ్స్ ఖాతాలపై కనీస బ్యాలెన్స్ (MAB) నిర్వహించనందుకు విధించే ఛార్జీలను మాఫీ చేసింది. ఇది కోట్లాది మంది కస్టమర్లకు పండుగ కానుక. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది, ఖాతాదారుల పై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) తన కోట్లాది మంది కస్టమర్లకు పండుగ కానుకగా సేవింగ్స్ ఖాతాలలో కనీస స్వేరేజ్ బ్యాలెన్స్ (MAB) నిర్వహించనందుకు విధించిన ఛార్జీలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఖాతాదారులపై అనవసరమైన ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
IOB సిక్స్టీ ప్లస్, IOB సేవింగ్స్ బ్యాంక్ పెన్షనర్, స్మాల్ అకౌంట్స్, IOB సేవింగ్స్ బ్యాంక్ జీతం ప్యాకేజీతో సహా అనేక ప్రత్యేక పథకాలకు కనీస బ్యాలెన్స్ అవసరాలను ఇప్పటికే మాఫీ చేసినట్లు IOB తెలిపింది. IOB మేనేజింగ్ డైరెక్టర్, CEO అజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. “మా ఖాతాదారులకు గణనీయమైన ఉపశమనం కలిగించే ఈ మాఫీని ప్రకటించడానికి మేం సంతోషిస్తున్నాం. మా కస్టమర్లకు బ్యాంకింగ్‌ను మరింత సౌకర్యవంతంగా, ఇబ్బంది లేకుండా చేయడమే మా లక్ష్యం” అని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




