Post Office: ఒక్కసారి ఇన్వెస్ట్ చెయ్యండి ప్రతీ నెల వడ్డీ పొందండి.. పొస్టాఫీస్ స్కీమ్‌..

మరి అలా కాకుండా మీ డబ్బు భద్రంగా ఉండి నెల నెల రోజు వడ్డీ తెచ్చుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! మీలాంటి వారి కోసమే భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ను అందిస్తోంది. డబ్బుకు ఎలాంటి రిస్క్‌ లేకుండా ఎంచక్కా నెలనెలా వడ్డీ విత్‌డ్రా చేసుకోవచ్చు. మరి పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న...

Post Office: ఒక్కసారి ఇన్వెస్ట్ చెయ్యండి ప్రతీ నెల వడ్డీ పొందండి.. పొస్టాఫీస్ స్కీమ్‌..
Post Office
Follow us
Narender Vaitla

|

Updated on: May 09, 2024 | 6:13 PM

ఉద్యోగ విరమణ తర్వాతో లేక ఏదైనా భూమిని విక్రయించిన సమయంలో చేతిలో ఉన్న డబ్బును ఏం చేయాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే పెద్ద మొత్తం డబ్బును రియల్‌ ఏస్టేట్‌లో పెట్టుబడిగా పెడదామంటే రిస్క్‌ అనిపిస్తుంది. పోనీ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెడదామా అంటే అదీ రిస్క్‌తో కూడుకున్న అంశమే.

మరి అలా కాకుండా మీ డబ్బు భద్రంగా ఉండి నెల నెల రోజు వడ్డీ తెచ్చుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ! మీలాంటి వారి కోసమే భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ను అందిస్తోంది. డబ్బుకు ఎలాంటి రిస్క్‌ లేకుండా ఎంచక్కా నెలనెలా వడ్డీ విత్‌డ్రా చేసుకోవచ్చు. మరి పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న ఆ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ ఏంటి.? ఎంత వడ్డీ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే ప్రతీ నెల వడ్డీని పొందొచ్చు. ఈ అకౌంట్‌ను సింగిల్‌ లేదా జాయింట్‌ అకౌంట్‌గా తీసుకకోవచ్చు. సింగిల్‌ అకౌంట్‌ అయితే గరిష్టంగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అదే ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. ఈ పథకంలో 5 సంవత్సరాల కాలానికి డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ఇందులో పెట్టుబడిగా పెట్టిన మొత్తానికి పోస్టాఫీస్‌ 7.40 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

ఇందులో వచ్చే వడ్డీని ప్రతీ నెల విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు సింగిల్‌ అకౌంట్‌లో గరిష్టంగా రూ. 9 లక్షలు డిపాజిట్ చేశారనుకుంటే ప్రతీ నెల రూ. 5,500 పొందొచ్చు. అలాగే జాయింట్ ఖాతాలో గరిష్టంగా రూ. 15 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతీ నెల రూ. 9,250 గ్యారెంటీగా పొందొచ్చు. ఇలా మీ అసలు మొత్తం భద్రంగా ఉంటూనే ప్రతీ నెల ఎంచక్కా వడ్డీ పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..