అదిరిపోయే స్కీం.. రూ. 1 లక్ష డిపాజిట్‌తో.. రూ. 27 లక్షలు మీ సొంతం.. వివరాలివే..!
PPF Scheme News: పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటులో స్థిరమైన క్షీణత ఉంది. ఇలాంటి పరిస్థితులలో, పెట్టుబడిదారులు తక్కువ మొత్తంలో..
PPF Scheme News: పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటులో స్థిరమైన క్షీణత ఉంది. ఇలాంటి పరిస్థితులలో, పెట్టుబడిదారులు తక్కువ మొత్తంలో ఎక్కువ శాతం పెట్టుబడి వచ్చే మార్గాల గురించి అన్వేషిస్తుంటాడు. ఒకవేళ ఓ పెట్టుబడిదారుడు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, అప్పుడు అతడు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బును పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఒకవేళ రిస్క్ తీసుకోకపోతే బెటర్ అని అనుకుంటే.. స్థిర ఆదాయ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో పొదుపు చేస్తే మంచిది. అలాంటి స్కీం ఒకదాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం.. ఈ ప్రభుత్వ స్కీంలో మీరు లక్ష పెట్టుబడి పెడితే.. 15 ఏళ్ల తర్వాత 27 లక్షలు పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం…
తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి.. ఎక్కువ శాతం రాబడి సంపాదించేందుకు ఏకైక అద్భుత పధకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్). కేంద్రం ఈ స్కీంను 1968లో ప్రారంభించింది. ఇది గత 53 సంవత్సరాలుగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ వస్తోన్న స్కీం. ఇక ఇది పొదుపు పథకం మాత్రమే కాదు.. పన్ను ఆదా పథకం అని కూడా చెప్పవచ్చు. ఇదొక దీర్ఘకాలిక పెట్టుబడి పథకం, దీనిలో మీరు ప్రతి సంవత్సరం పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇక దీని మెచ్యూరిటీ గడువు పూర్తయినప్పుడు.. వచ్చే మొత్తం, వడ్డీ ఆదాయం రెండూ కూడా పన్ను రహితంగా ఉంటాయి.
ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష డిపాజిట్, చివరికి రూ. 27 లక్షలు పొందుతారు..
ప్రస్తుతం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. మీరు సంవత్సరంలో రూ. 500 నుంచి, గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం గడువు 15 సంవత్సరాలు. ఒక పెట్టుబడిదారుడు ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు జమ చేయడం ప్రారంభిస్తే, ప్రస్తుత రేటు నుండి 15 సంవత్సరాల తరువాత, అతనికి 27 లక్షల 12 వేల 139 రూపాయలు లభిస్తాయి. ఇది పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. ఇందులో ప్రధాన మొత్తం 15 లక్షల రూపాయలు కాగా, వడ్డీ ఆదాయం 12 లక్షల 12 వేల 139 రూపాయలు.
ఒకవేళ మీరు నెలకు 500 పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తరువాత, మీకు రూ .1,62,728 లభిస్తుంది. మీరు ప్రతి నెలా 1000 రూపాయలు పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల తరువాత మీకు 3,25,457 రూపాయలు లభిస్తాయి. ప్రతి సంవత్సరం 10 వేల రూపాయలు పెట్టుబడి పెడితే వారికి 2,71,214 రూపాయలు లభిస్తాయి.
పిపిఎఫ్ ఖాతాలో రుణ, పాక్షిక ఉపసంహరణ సౌకర్యం…
పిపిఎఫ్ ఖాతాదారులకు రుణ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ సౌకర్యం గడువు సమయంలోని మూడు, ఐదవ సంవత్సరంలో లభిస్తుంది. అలాగే పెట్టుబడిదారుడు తమ ఫండ్‌లోని 50 శాతం మొత్తాన్ని పీపీఎఫ్ గడువు ఆరు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఉపసంహరించుకోవచ్చు.
మరిన్ని ఇక్కడ చదవండి:
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!