Infosys CEO Salary: సీఈవో జీతాన్ని భారీగా పెంచిన ఇన్ఫోసిస్.. ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..

Infosys CEO Salary: ఇన్ఫోసిస్ తన వాటాదారుల వార్షిక నివేదికలో కంపెనీ CEO పరేఖ్‌కు అందిస్తున్న పరిహారం వివరాలను వెల్లడించింది. తాజాగా ఆయన జీతభత్యాలను కంపెనీ భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Infosys CEO Salary: సీఈవో జీతాన్ని భారీగా పెంచిన ఇన్ఫోసిస్.. ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..
Infosys Ceo
Follow us

|

Updated on: May 26, 2022 | 5:15 PM

Infosys CEO Salary: ఇన్ఫోసిస్ తన వాటాదారుల వార్షిక నివేదికలో కంపెనీ CEO పరేఖ్‌కు అందిస్తున్న పరిహారం వివరాలను వెల్లడించింది. ఇటీవలి సంవత్సరాల్లో ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ నమోదు వృద్ధి కారణంగా సీఈవోకు భారీ మెుత్తంలో జీతభత్యాలను అందిస్తోంది. కంపెనీ పనితీరును మెరుగుపరిచి వృద్ధిలో కొనసాగేలా కీలక పాత్ర పోషించటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జూలై 1, 2022 నుంచి మార్చి 31, 2027 వరకు.. అంటే 5 ఏళ్ల కాలానికి ఇన్ఫోసిస్‌లో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తిరిగి నియమితులైన కొద్ది రోజులకే పరేఖ్ పరిహారాన్ని కంపెనీ పెంచింది. మొత్తం వాటాదారుల రాబడి, మార్కెట్ క్యాప్ పెరుగుదల వంటి కీలక అంశాలను ఇన్ఫోసిస్ జీతం పెంపుకోసం పరిగణలోకి తీసుకుంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఉంది.

ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సలీల్ పరేఖ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 71 కోట్ల జీతం అందుకున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. 2020-21లో రూ.49.68 కోట్లపై దాదాపు 43 శాతం మేర ఆయన జీతం పెరిగింది. ఈ మెుత్తంలో 52.33 కోట్లు పెర్క్విసిట్‌లలో స్టాక్ ఆప్షన్‌లు, రూ. 5.69 కోట్ల స్థిర వేతనం, రిటైర్‌మెంట్ ప్రయోజనాల రూపంలో రూ. 38 లక్షలతో సహా వేరియబుల్ పేగా రూ. 12.62 కోట్లను పరేఖ్ అందుకుంటున్నారు. పరేఖ్ జనవరి 2018 నుంచి ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

కంపెనీలో ఆరుగురు కీలకమైన మేనేజ్‌మెంట్ సిబ్బందికి 1,04,000 షేర్లు, 88 మంది ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు మరో 375,760 షేర్ల మంజూరుకు ఇన్ఫోసిస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించింది. ఇందులో భాగంగానే పరేఖ్ పరిహారాన్ని కంపెనీ పెంచినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో.. నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయిన నందన్ నీలేకని కంపెనీకి అందించిన సేవలకు ఎలాంటి పారితోషికం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి