AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Axis Bank: కస్టమర్లకు షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్.. సర్వీస్ ఛార్జీలు భారీగా పెంపు.. పూర్తి వివరాలు

Axis Bank: దేశంలో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న యాక్సిస్ బ్యాంక్ తన ఖాతాదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సారి తన బ్యాంకింగ్ సేవల ఛార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించింది.

Axis Bank: కస్టమర్లకు షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్.. సర్వీస్ ఛార్జీలు భారీగా పెంపు.. పూర్తి వివరాలు
Axis Bank
Ayyappa Mamidi
|

Updated on: May 26, 2022 | 6:54 PM

Share

Axis Bank: దేశంలో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న యాక్సిస్ బ్యాంక్ తన ఖాతాదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సారి తన బ్యాంకింగ్ సేవల ఛార్జీలను పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరిగిన ఛార్జీలు జూన్1,2022 నుంచి అమలులోకి రానున్నాయి. ఇందులో భాగంగా మినిమం బ్యాలెన్స్ నిర్వహణ, NACH డెబిట్ అండ్ ఆటో డెబిట్ ఫెయిల్యూర్, చెక్ బుక్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మినిమం బ్యాలెన్స్..

వినియోగదారులు జూన్ నుంచి నెలవారీ యావరేజ్ బ్యాలెన్స్ తప్పక మెయింటెన్ చేయాలి. సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. లేదా ఛార్జీలు వర్తించకుండా ఉండాలంటే లక్ష రూపాయలు టర్మ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గ్రామీణ సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంక్ ఖాతాల్లో క్వార్టర్లీ బ్యాలెన్స్ సగటున రూ.15 వేలు లేదా రూ. లక్ష డిపాజిట్ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. లిబర్టీ ఖాతాలకు ఇది రూ.25 వేలుగా ఉంది. ఒకవేళ ఈ బ్యాలెన్స్ రూల్స్ పాటించకపోతే.. మెట్రో/అర్బన్ ప్రాంతాల్లో రూ. 500 నుంచి రూ. 600, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 300, గ్రామీణ ప్రాంతాల్లో రూ.250 ఛార్జీలు ఉంటాయని బ్యాంక్ తన వెబ్ సైట్ లో తెలిపింది. ఈ ఛార్జీలు గతంలో కంటే 7.5 శాతం మేర పెంచబడ్డాయి.

నెలవారీ నగదు లావాదేవీ ఉచిత పరిమితులు..

ప్రైమ్, లిబర్టీ కింద ఉన్న అన్ని పొదుపు ఖాతాలకు ఇది వర్తిస్తుంది. మొదటి 5 లావాదేవీలు లేదా రూ. 1.5 లక్షలు (ఏది ముందైతే అది) కస్టమర్లు ఉచితంగా పొందవచ్చు. ఇంతకు ముందు ఆ పరిమితి మొదటి 5 లావాదేవీలు లేదా రూ. 2 లక్షలు (ఏది ముందైతే అది)గా ఉండేది.

ఆటో డెబిట్ ఫెయిల్యూర్..

ఆటో డెబిట్ ఫెయిల్యూర్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ రిజెక్షన్ ఛార్జీలు ఒక ఫెయిల్యూర్‌కు ఇంతకు ముందు ఉన్న రూ.200 నుంచి రూ.250 పెంచబడ్డాయి. దీనికి తోడు క్యాష్ రీసైక్లర్, డిపాజిట్ మెషిన్లలో సాయంత్రం 5 నుంచి మరుసటి రోజు ఉదయం 9.30 మధ్య చేసే లావాదేవీకి రూ.50 ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. అలాగే బ్యాంక్ సెలవు రోజు లేదా నెలకు రెండు ట్రాన్సాక్షన్స్ లేదా రూ. 5 వేల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు నిర్వహిస్తే ఒక్కో ఛార్జీకి రూ.50 చెల్లించక తప్పదు. ఫిజికల్ బ్యాంక్ స్టేట్ మెంట్ ఛార్జీలు రూ.100కు పెంచింది. ఇకపై చెక్ లీఫ్ కు రూ.4 చెల్లించాలి. అవుట్ వర్డ్ చెక్ రిటర్న్ ఛార్జీలు రూ. 100గా బ్యాంక్ నిర్ణయించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి