AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: జయహో భారత్.. ఇక విదేశాలకూ మన వందే భారత్ రైళ్లు

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం ఊపందుకున్నదని అశ్విని వైష్ణవ్ అన్నారు. 2004 నుంచి 2014 వరకు రోజుకు సగటున నాలుగు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ను నిర్మిస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఇప్పుడు ప్రతిరోజూ 15 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు వేస్తున్నారు. గత పదేళ్లలో 41 వేల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను విద్యుదీకరించారు.

Vande Bharat: జయహో భారత్.. ఇక విదేశాలకూ మన వందే భారత్ రైళ్లు
Vendebharat Express
Subhash Goud
|

Updated on: Feb 12, 2024 | 7:02 AM

Share

భారత ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఆదరణ లభిస్తోంది. అత్యంత వేగంతో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లు దేశంలో మొత్తం 82 రైళ్లు నడుస్తున్నాయి. అత్యంత టెక్నాలజీకి తయారైన ఈ రైళ్లకు ఇతర దేశాల వారు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రయాణికులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. హైస్పీడ్‌, అద్భుతమైన సౌకర్యాలతో కూడిన ఈ రైలు భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా క్రేజీగా ఉంది. ఈ సెమీ హైస్పీడ్ రైలును ఎగుమతి చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొనుగోలు గురించి చాలా దేశాలు ఆరా తీశాయని, రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం ఈ అద్భుతమైన రైళ్లను ఎగుమతి చేయడం ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు.

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. వందే భారత్ రైలు భాగాలను స్వదేశీ డిజైన్, సామర్థ్యంతో తయారు చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ యూనిట్లతో పాటు దాని స్వంత వర్క్‌షాప్‌లను ప్రారంభించింది. మన దేశంలో మన ఇంజనీర్ల సహకారంతో వందేభారత్ రైలును నిర్మించడం పెద్ద సవాలే అని అన్నారు. తాము ఈ సవాలును అధిగమించామని, రానున్న కొద్ది సంవత్సరాల్లో భారత్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయగలదని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.

దేశంలో 82 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం భారతదేశంలో 82 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. వందేభారత్ రైళ్ల వేగాన్ని కూడా పెంచే పనులు కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి తెలిపారు. న్యూఢిల్లీ-ముంబై, న్యూఢిల్లీ-హౌరా మార్గాల్లో వందేభారత్ రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ప్రతిరోజూ 15 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌ను నిర్మిస్తున్నాం:

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం ఊపందుకున్నదని అశ్విని వైష్ణవ్ అన్నారు. 2004 నుంచి 2014 వరకు రోజుకు సగటున నాలుగు కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌ను నిర్మిస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఇప్పుడు ప్రతిరోజూ 15 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు వేస్తున్నారు. గత పదేళ్లలో 41 వేల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను విద్యుదీకరించారు. 2004 నుంచి 2014 వరకు రైల్వేలో పెట్టుబడులు రూ.15,674 వేల కోట్లుగా ఉన్నాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కాపెక్స్ రూ. 2,52,000 కోట్లు. రానున్న రోజుల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మరింతగా పెంచనున్నట్లు మంత్రి చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి