Power Consumption: భారత్‌లో పెరిగిన విద్యుత్ వినియోగం.. నవంబర్‌లో ఎంత పెరిగిందంటే..
Power Consumption: ఈ సంవత్సరం ప్రారంభంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ మే నెలలో పగటిపూట 235 గిగావాట్ల సాయంత్రం వేళల్లో 225 గిగావాట్ల జూన్‌లో పగటిపూట 240 జీడబ్ల్యూ, సాయంత్రం..
గత సంవత్సరంతో పోలిస్తే నవంబర్‌లో భారతదేశ విద్యుత్ వినియోగం 5.14 శాతం పెరిగి 125.44 బిలియన్ యూనిట్లకు (BU) చేరుకుంది. నవంబర్ 2023లో ప్రభుత్వ డేటా ప్రకారం.. విద్యుత్ వినియోగం 119.30 గిగావాట్ల. ఒక రోజులో అత్యధిక సరఫరా (పీక్ పవర్ డిమాండ్ మెట్) కూడా 2024 నవంబర్‌లో 204.56 గిగావాట్ల నుండి 207.42 GWకి స్వల్పంగా పెరిగింది.
గరిష్ట విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది మేలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 250 గిగావాట్లకు చేరుకుంది. రాత్రి సమయంలో ఆల్ టైమ్ హై పీక్ పవర్ డిమాండ్ 243.27 గిగావాట్ల సెప్టెంబర్ 2023లో నమోదైంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ మే నెలలో పగటిపూట 235 గిగావాట్ల సాయంత్రం వేళల్లో 225 గిగావాట్ల జూన్‌లో పగటిపూట 240 జీడబ్ల్యూ, సాయంత్రం వేళల్లో 235 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసింది.
ఈ వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 260 గిగావాట్లకు చేరుకోవచ్చని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అయితే, మంచి వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు ఉష్ణోగ్రత తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో విద్యుత్ వినియోగానికి డిమాండ్ స్థిరంగా ఉంటుందని వారు చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి