AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Profit: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. మూడు నెలల్లో అధిక ఆదాయం.. రికార్డ్‌ స్థాయిలో మార్కెట్ క్యాప్

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బలమైన లాభాలను నమోదు చేసింది. ఇదిలా ఉంటే బ్యాంకు 30 శాతం నికర లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం..

Bank Profit: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. మూడు నెలల్లో అధిక ఆదాయం.. రికార్డ్‌ స్థాయిలో మార్కెట్ క్యాప్
Bank
Subhash Goud
|

Updated on: Jul 18, 2023 | 7:00 AM

Share

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బలమైన లాభాలను నమోదు చేసింది. ఇదిలా ఉంటే బ్యాంకు 30 శాతం నికర లాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం రూ.11,952 కోట్లకు పెరిగింది. క్రితం త్రైమాసికంలో రూ.9,196 కోట్లు.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభాల్లో రికార్డు పెరుగుదల మాత్రమే కాదు. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ విలీనం తర్వాత ఇది ప్రపంచంలోని ఏడవ అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఫలితాలు కూడా బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలో పెద్ద పెరుగుదలను నమోదు చేశాయి. ఈ కాలంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 21.1 శాతం పెరిగి రూ. 23,599 కోట్లు దాటింది.

మార్కెట్ క్యాప్ కూడా రికార్డు స్థాయిలో..

HDFC బ్యాంక్ విలీనం తర్వాత మొదటి త్రైమాసిక ఫలితాలు HDFC బ్యాంక్ ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించింది. కొత్త షేర్ల జాబితా తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ.12.4 లక్షల కోట్లు దాటింది. జూలై 17న విలీనం తర్వాత, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్ మార్కెట్‌లో రూ.311 కోట్ల షేర్లు లిస్టయ్యాయి.

ఇవి కూడా చదవండి

విలీనం తర్వాత కొత్త పద్ధతిలో హెచ్‌డిఎఫ్‌సికి చెందిన ప్రతి 25 షేర్లకు వాటాదారులు 42 షేర్లను పొందుతారు. నేటి నుంచి మార్కెట్‌లో ఈ షేర్ల ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ మార్పు తరువాత ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ, చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ చైనా వంటి ప్రపంచ దిగ్గజాలను వదిలివేసింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇప్పుడు జెపి మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా వంటి దిగ్గజాలతో నేరుగా పోటీపడనుంది. మార్కెట్ క్యాప్ పరంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు. ప్రభుత్వ రంగంలో అయితే ఈ స్థానం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి