AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Privatisation: ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌..ఐడీబీఐలో 51 శాతం వాటా విక్రయించే యోచనలో ప్రభుత్వం..!

IDBI Bank: బ్యాంకు ప్రైవేటీకరణకు సంబంధించి పెద్ద వార్త బయటకు వస్తోంది. బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయవచ్చు. మీడియా నివేదికల ప్రకారం, ఐడిబిఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Bank Privatisation: ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌..ఐడీబీఐలో 51 శాతం వాటా విక్రయించే యోచనలో ప్రభుత్వం..!
Idbi
Sanjay Kasula
|

Updated on: Aug 24, 2022 | 8:24 PM

Share

ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఐడీబీఐ (IDBI bank) ప్రైవేటీకరణ అంశం మరోసారి స్క్రీన్‌పైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ(LIC) వాటాదారులుగా ఉన్న ఈ బ్యాంక్‌లోని 51 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని బిజినెస్ వర్గాలు అంటున్నాయి. యాజమాన్య హక్కులను సైతం బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయని వెల్లడించాయి. వాటాల విక్రయం తర్వాత కూడా కేంద్రం, ఎల్‌ఐసీ వద్ద వాటాలు ఉండనున్నాయి. కేంద్ర మంత్రుల బృందం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ చివరి నాటికి కొనుగోలుదారుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. డీల్ పై మంత్రుల బృందం తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. 

ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వ వాటా 45.48 శాతం. అదే సమయంలో, LIC 49.24 శాతం వాటాను కలిగి ఉంది. ఐడిబిఐ బ్యాంక్‌లో ప్రభుత్వం కొంత వాటాను విక్రయిస్తుందని.. ఎల్‌ఐసి కొంత వాటాను విక్రయిస్తుందని, నిర్వహణ నియంత్రణతో పాటు కొనుగోలుదారుకు కూడా అప్పగిస్తారని భావిస్తున్నారు. 40 శాతం కంటే ఎక్కువ వాటా కొనుగోలుకు ఆర్‌బీఐ ఆమోదం తెలుపుతుంది. ఐడీబీఐలో వ్యూహాత్మక వాటాలను విక్రయించేందుకు గతేడాది మే నెలలో కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

అయితే, ఈ అంశం ఐడీబీఐ గానీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ, ఎల్‌ఐసీగానీ స్పందించలేదని ‘బ్లూమ్‌బెర్గ్‌’ తెలిపింది. గడిచిన 12 నెలల్లో ఐడీబీఐ షేరు విలువ 6.3 శాతం పెరగడంతో బ్యాంక్‌ విలువ 5.3 బిలియన్‌ డాలర్లకు చేరింది.

ఇవి కూడా చదవండి

బ్యాంకుల యాజమాన్యం బ్యాంకింగ్ రంగ నియంత్రణకు సంబంధించి ఆర్‌బిఐ పాత్ర తటస్థంగా ఉందని గతంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల యజమానులు తమ వద్ద ఎంత వాటా ఉంచుకోవాలనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇతరులకు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు లేదా మీరు ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారా. అయితే బ్యాంకుల యాజమాన్యానికి సంబంధించి ఆర్‌బీఐ పాత్ర తటస్థంగా ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై, ప్రైవేటీకరణను ప్రశ్నిస్తూ గత వారం ఆర్‌బీఐ బులెటిన్‌లో కథనం ప్రచురితమైంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం