India’s Economic: 2023లో భారత ఆర్థిక వృద్ది మందగించనుంది: అంచనా వేసిన గోల్డ్‌మన్‌ శాక్స్‌

గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మన్ శాక్స్‌ 2022లో 6.9%గా ఉన్న భారతదేశంలో ఆర్థిక వృద్ధి 2023 క్యాలెండర్ సంవత్సరంలో 5.9%కి తగ్గుతుందని అంచనా వేసింది..

India’s Economic: 2023లో భారత ఆర్థిక వృద్ది మందగించనుంది: అంచనా వేసిన గోల్డ్‌మన్‌ శాక్స్‌
India’s Economic
Follow us

|

Updated on: Nov 23, 2022 | 9:21 AM

గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మన్ శాక్స్‌ 2022లో 6.9%గా ఉన్న భారతదేశంలో ఆర్థిక వృద్ధి 2023 క్యాలెండర్ సంవత్సరంలో 5.9%కి తగ్గుతుందని అంచనా వేసింది. అధిక వడ్డీరేట్లు, తగ్గిన వినియోగ గిరాకీ వంటి సవాళ్లతో.. కరోనా నుంచి వేగంగా కోలుకున్న ఫలాలు తగ్గాయని పేర్కొంది. అందువల్లే వృద్ధి నెమ్మదించనుందనిగ గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. ఈ సంవత్సరం భారత జీడీపీ 6.9 శాతంగా నమోదవుతుందని, వచ్చే ఏడాది అది 5.9 శాతానికి తగ్గుతుందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. 2023 ప్రథమార్ధంలో వృద్ధి నెమ్మదిగా ఉంటుందని భావిస్తోంది. కోవిడ్‌ పునరుత్తేజ ఫలితాలు కనుమరుగవ్వడం, ద్రవ్య విధానాలను కఠినతరం చేయడం వినియోగ డిమాండ్‌పై ప్రభావం చూపుతుందని తెలిపింది.

అయితే ద్వితీయార్ధానికి వృద్ధి వేగంగా ఉంటుందని, ప్రపంచవ్యాప్తంగా వృద్ధి పెరగడం, అలాగే ఎగుమతులు సైతం పుంజుకోవడం ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడించింది. కరోనా సంక్షోభం నుంచి 2021-22లో వేగంగా కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలిచిన విషయం తెలిసిందే. కానీ, ఈ సంవత్సరం ఆ జోరును కొనసాగించలేకపోయిందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ పేర్కొంది.

అడ్డంకింగా మారిన అనేక సవాళ్లు:

ఇందుకు అనేక సవాళ్లు అడ్డంకిగా మారాయని తెలిపింది. యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్‌ కఠిన వైఖరి, అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు పెరగడం వంటి పరిణామాలు అడ్డంకిగా మారాయని వెల్లడించింది. ఇతర దేశాలతో పోల్చినట్లయితే డాలర్‌తో రూపాయి మారకం విలువ మెరుగ్గానే ఉందని తెలిపింది. మరో వైపు ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం 6.8%గా ఉంటుందని, వచ్ఏచ ఏడాది 6.1 %కు తగ్గుతుందని తెలిపింది. అయితే ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకువచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిసెంబర్‌లో రో 50 వేసిస్‌ పాయింట్లు, ఫిబ్రవరిలో 35 బేసిస్‌ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని భావిస్తోంది.

దీంతో రెపోరేటు 6.75 % వరకు చేరుకుంటుందని అంచనా వేసింది. భారత వృద్ది అంచనాను కూడా క్రిసిల్‌ 7.3 % నుంచి 7 %నికి తగ్గిందని ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ నివేదించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో వృద్ది 6 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది. అనేక రేటింగ్‌ ఏజన్సీలు అక్టోబర్‌, నవంబర్‌ మధ్య భారతదేశ వృద్ది అంచనాను తగ్గించాయి.

మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నవంబర్ 11న భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను దాని మునుపటి అంచనా 7.7% నుండి 7%కి తగ్గించింది. ప్రపంచ బ్యాంక్ జూన్‌లో ప్రకటించిన 7.5% కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-’23) భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాను 6.5%కి తగ్గించింది. క్షీణిస్తున్న అంతర్జాతీయ పర్యావరణం కారణంగా వృద్ధి అంచనాను ఒక శాతం దిగువకు సవరించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్