Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India GDP: భారత్ ఆర్థిక వృద్ధి రేటు జోరు.. అంచనాలను మించి 7.8 శాతంగా నమోదైన జీడీపీ

India Economy: దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించి వేగంగా పెరుగుతోంది. తాజాగా.. భారతదేశం ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకుంది. మార్చినెలతో ముగిసిన గత త్రైమాసికంలో ఇది 6.1 శాతంగానే ఉంది. గత త్రైమాసికంతో పోలిస్తే..

India GDP: భారత్ ఆర్థిక వృద్ధి రేటు జోరు.. అంచనాలను మించి 7.8 శాతంగా నమోదైన జీడీపీ
India GDP
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 31, 2023 | 6:22 PM

India Economy: దేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించి వేగంగా పెరుగుతోంది. తాజాగా.. భారతదేశం ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకుంది. మార్చినెలతో ముగిసిన గత త్రైమాసికంలో ఇది 6.1 శాతంగానే ఉంది. గత త్రైమాసికంతో పోలిస్తే.. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 1.7 శాతం ఎక్కువగా నమోదు కావడం విశేషం. తాజాగా విడుదలైన జీడీపీ గణాంకాల పట్ల దేశ పారిశ్రామిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) 2023 ఆగస్టు 31న విడుదల చేసిన డేటా ప్రకారం.. భారత వృద్ధి అత్యధికంగా ఉంది. ఈ వృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన సంస్కరణలు కారణమని చెప్పవచ్చంటూ పేర్కొంది.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సేవారంగాల్లో వృద్ధి జోరందుకోవడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ అంచనాలను మించి నమోదు కావడానికి దోహదపడింది. ఈ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం (ఆగస్టు 31) విడుదల చేసింది. దీనికి ముందు ఆర్బీఐ సైతం భారత వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేయడం విశేషం.. ఈ అంచనాలను నిజం చేస్తూ భారత్ గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేసుకుంది. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు.. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతోనే ఇది సాధ్యం అయినట్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడులు సైతం పెరిగాయి.

కాగా.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల భారతదేశ GDP వృద్ధి అంచనాను 2023కి 6.1 శాతానికి సవరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో అంచనా వేసిన 5.9 శాతం నుండి. బలమైన దేశీయ పెట్టుబడుల దృష్ట్యా వృద్ధి రేటు పెరిగే అవకాశముందని పేర్కొంది.

FY24లో భారతదేశం 6.5 శాతం వృద్ధి చెందుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంతకుముందు అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో వృద్ధి రేటు 8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

ఈ అంచనాలన్నీ దాటుకుని.. భారత వృద్ధి రేటు భారీగా పెరిగింది. జూలైలో సేవల రంగం 13 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న జూలై-సెప్టెంబర్ త్రైమాసిక వృద్ధి గణాంకాలు నవంబర్ 30న విడుదల కానున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..