Stock Markets: వరుసగా ఆరవ రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్.. లాభాల్లో ఆ కంపెనీల షేర్లు..

Stock Markets: భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. 1994 తర్వాత అమెరికా సెంట్రల్ బ్యాంక్‌ ఫెడ్‌ భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

Stock Markets: వరుసగా ఆరవ రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్.. లాభాల్లో ఆ కంపెనీల షేర్లు..
Stock Market
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Jun 17, 2022 | 4:23 PM

Stock Markets: భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. 1994 తర్వాత అమెరికా సెంట్రల్ బ్యాంక్‌ ఫెడ్‌ భారీగా వడ్డీ రేట్లను పెంచడంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్ సూచీలు వారాంతంలోనూ కోలుకోలేదు. దీంతో భారతీయ మార్కెట్ వరుసగా ఆరవ రోజు బలహీనతను పొడిగించింది. ఈ వారంలో ఒక్క రోజు కూడా మార్కెట్లు గ్రీన్ లో లేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ-50.. 0.4% క్షీణించి 15,300 దగ్గర ముగియగా, మరో కీలక సూచీ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పడిపోయి 51,400 దగ్గర స్థిరపడింది. ఎందుకంటే మార్కెట్ చివరి నిమిషంలో భారీ పతనం నుంచి కొంత రికవరీని సాధించింది. బెంచ్‌మార్క్ సూచీలు నష్టాల్లో ఉండగా.. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఒక్క శాతం, స్మాల్‌క్యాప్ 0.7 శాతం మేర క్షీణించాయి.

సెక్టార్ల వారీగా చూస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు లాభపడగా, ఆయిల్ & గ్యాస్, ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ మార్కెట్ ఆరవ రోజు సాగిన క్రమంలో గరిష్ఠ నష్టాలను చవిచూసింది. ఈ రోజు బలహీన మార్కెట్లో బజాజ్ ట్విన్స్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ లాభాల్లో క్లోస్ అయ్యాయి. టైటాన్, విప్రో, శ్రీ సిమెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ అత్యధికంగా క్షీణించాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!