Crude Oil: పెరుగుతోన్న ముడి చమురు ధర.. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే తరువాయి..!

ముడి చమురు ధర బ్యారెల్‌కు దశాబ్ద గరిష్ట స్థాయి 121 డాలర్లకు చేరుకుంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పిపిఎసి) డేటా ప్రకారం ఇంతకు ముందు 2012 ఫిబ్రవరి/మార్చి నెలలో ఈ స్థాయి ధర కనిపించింది...

Crude Oil: పెరుగుతోన్న ముడి చమురు ధర.. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే తరువాయి..!
Crude Oil
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 11, 2022 | 2:21 PM

ముడి చమురు ధర బ్యారెల్‌కు దశాబ్ద గరిష్ట స్థాయి 121 డాలర్లకు చేరుకుంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పిపిఎసి) డేటా ప్రకారం ఇంతకు ముందు 2012 ఫిబ్రవరి/మార్చి నెలలో ఈ స్థాయి ధర కనిపించింది. PPAC ప్రకారం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 25 నుంచి మార్చి 29 మధ్య భారతీయ ముడి చమురు ప్రామాణిక ధర బ్యారెల్‌కు సగటున $111.86గా ఉంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 27 మధ్య బ్యారెల్‌కు సగటున $103.44గా ఉంది. అమెరికా వంటి ప్రధాన కస్టమర్ల నుంచి బలమైన డిమాండ్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర గురువారం 13 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే, శుక్రవారం క్షీణతను నమోదు చేసింది. ఆగస్టు నెల బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 81 సెంట్లు ($0.81) తగ్గి 122.26 డాలర్లకు చేరుకుంది. యుఎస్ వెస్ట్ టెక్స్ ఇంటర్మీడియట్ క్రూడ్ జూలైలో బ్యారెల్‌కు 79 సెంట్లు తగ్గి 120.72 డాలర్లకు చేరుకుంది.

చమురు ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దేశంలో రిటైల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ధరలు పెంచలేదు. భారత్ తన మొత్తం చమురు అవసరాలలో 85 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. అటువంటి పరిస్థితిలో ఇంధనం రిటైల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లోని ప్రామాణిక ధర ప్రకారం ఉంచుతారు. స్థానిక పెట్రోలు పంపుల్లో బ్యారెల్‌కు 85 డాలర్లు చొప్పున ధరలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకరిస్తున్నందున చమురు కంపెనీలు ధరలను పెంచలేదు. ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ట స్థాయి 7.8 శాతానికి చేరుకుంది.