Home Loan: తక్కువ వడ్డీతో గృహ రుణాలిస్తున్న ఆ ఐదు బ్యాంక్‌లు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 4.40 నుంచి 4.90 శాతానికి పెంచింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ జూన్ 8న రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 4.40 నుంచి 4.90 శాతానికి పెంచింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ జూన్ 8న రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. RBI ప్రకటన తర్వాత అన్ని బ్యాంకులు కూడా అన్ని రకాల రుణాల వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. రెపో రేటును పెంచిన తర్వాత, అన్ని రకాల రుణాలు ఖరీదైనవిగా మారాయి. ముఖ్య హోం లోన్ వడ్డీ రేట్లు పెరిగాయి. గృహ రుణం చెల్లింపు మిగిలిన రుణాల కంటే చాలా ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే వడ్డీ తక్కువ వసూలు చేస్తున్న బ్యాంక్‌లో లోన్ తీసుకోవాలి. ఇతర బ్యాంకులతో పోల్చితే తక్కువ ధరకే గృహ రుణం ఇస్తున్న 5 బ్యాంక్‌లు ఏవో తెలుసుకుందాం..
అతి తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలు అందించే 5 బ్యాంకుల్లో అన్ని ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అతి తక్కువ వడ్డీ రేట్లలో 6.8 శాతం చౌకైన గృహ రుణాన్ని అందిస్తోంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ గరిష్ట వడ్డీ రేట్లలో 7.75 శాతం వద్ద సరసమైన రుణాలను అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 6.9 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.2 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.25 శాతం వడ్డీతో గృహ రుణాలు ఇస్తున్నాయి.35 రోజుల్లోనే రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 0.90 శాతం పెంచింది. మే 4, 2022న, RBI రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు 4 నుండి 4.40 శాతానికి పెంచింది. దీని తర్వాత జూన్ 8న ఆర్బీఐ మరోసారి రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది, దీని కారణంగా రెపో రేటు 4.40 శాతం నుండి 4.90 శాతానికి పెరిగింది.