AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక రైళ్లు

Indian Railways: ఆషాఢ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పండరీపురం వెళ్లే అవకాశం ఉన్నందున ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సూచించింది. రైళ్ల సమయాలు, స్టాప్‌లు, రిజర్వేషన్ వివరాలను ముందుగానే పరిశీలించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని..

Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
Indian Railways
Subhash Goud
|

Updated on: Jul 14, 2026 | 3:42 PM

Share

Indian Railways: ఆషాఢ ఏకాదశి వేడుకల సందర్భంగా ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. వివిధ ప్రాంతాల నుండి పండరీపురానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల వివరాలు, వాటి వేళలు, స్టేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

పండరీపురం వెళ్లే భక్తుల సౌకర్యార్థం మొత్తం మూడు జతల ప్రత్యేక రైళ్లను జూలై 24, 25 తేదీల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ప్రత్యేక రైళ్లలో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

నాగర్‌సోల్ – పండరీపురం – జల్నా ప్రత్యేక రైళ్లు:

  • రైలు నెం. 07631 నాగర్‌సోల్ నుంచి జూలై 24 (శుక్రవారం) సాయంత్రం 7 గంటలకు బయలుదేరి, జూలై 25 (శనివారం) మధ్యాహ్నం 12:50 గంటలకు పండరీపురం చేరుకుంటుంది.
  • రైలు నెం. 07632 పండరీపురం నుంచి జూలై 25 (శనివారం) రాత్రి 8 గంటలకు బయలుదేరి, జూలై 26 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు జల్నా చేరుతుంది. ఈ రైళ్లు రోటేగావ్, లాసూర్, ఛత్రపతి సంభాజీనగర్, జల్నా, పర్భణి, పర్లీ వైజ్‌నాథ్, లాతూర్, ధారాశివ్, కుర్దువాడి, మోడ్నింబ్ తదితర స్టేషన్లలో ఆగుతాయి.

ఆదిలాబాద్ – మీరజ్ ప్రత్యేక రైళ్లు:

  • రైలు నెం. 07633 ఆదిలాబాద్ నుంచి జూలై 24 ఉదయం 5 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11:55 గంటలకు మీరజ్ చేరుతుంది.
  • రైలు నెం. 07634 మీరజ్ నుంచి జూలై 25 రాత్రి 9:30 గంటలకు బయలుదేరి, జూలై 26 మధ్యాహ్నం 3 గంటలకు ఆదిలాబాద్ చేరుతుంది.
  • ఈ రైళ్లు కిన్వాట్, నాందేడ్, పూర్ణా, పర్భణి, పర్లీ వైజ్‌నాథ్, లాతూర్, పండరీపురం, సంగోలా, జాత్ రోడ్ తదితర ప్రధాన స్టేషన్లలో ఆగనున్నాయి.

అకోలా – పండరీపురం ప్రత్యేక రైళ్లు

  • రైలు నెం. 07635 అకోలా నుంచి జూలై 24 ఉదయం 11 గంటలకు బయలుదేరి, జూలై 25 ఉదయం 9:20 గంటలకు పండరీపురం చేరుతుంది.
  • రైలు నెం. 07636 పండరీపురం నుంచి జూలై 25 మధ్యాహ్నం 3:50 గంటలకు బయలుదేరి, జూలై 26 సాయంత్రం 4:50 గంటలకు అకోలా చేరుతుంది.

ఈ రైళ్లు వాషిం, హింగోలి, బస్మత్, పూర్ణా, పర్భణి, పర్లీ వైజ్‌నాథ్, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, తాండూర్, కలబురగి, సోలాపూర్, కుర్దువాడి, మోడ్నింబ్ తదితర స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ప్రయాణికులకు సూచన

ఆషాఢ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పండరీపురం వెళ్లే అవకాశం ఉన్నందున ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సూచించింది. రైళ్ల సమయాలు, స్టాప్‌లు, రిజర్వేషన్ వివరాలను ముందుగానే పరిశీలించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.

Special Trains for Ashadha Ekadashi

Special Trains for Ashadha Ekadashi

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక రైళ్లు
500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం..లాభాలు తెలిస్తే వదలరు
500 ఏళ్ల చరిత్ర కలిగిన రాయలనాటి తీపి వంటకం..లాభాలు తెలిస్తే వదలరు
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్..
ఒక్క ముక్క తింటే ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది..
ఒక్క ముక్క తింటే ఒంట్లో రక్తం ఫుల్లుగా పడుతుంది..
వాట్ ఏ ప్లానింగ్.. వాట్ ఏ విజన్.. పిచ్చొళ్లు అయిపోయారంతా.. వీడియో
వాట్ ఏ ప్లానింగ్.. వాట్ ఏ విజన్.. పిచ్చొళ్లు అయిపోయారంతా.. వీడియో
టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి గంభీర్ ఫ్రెండ్ రాజీనామా?
టీమిండియా అసిస్టెంట్ కోచ్ పదవికి గంభీర్ ఫ్రెండ్ రాజీనామా?
ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డుకు డా. పి. విజయ ఎన్నిక..
ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డుకు డా. పి. విజయ ఎన్నిక..
పింక్‌ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..
పింక్‌ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..
భూమి బద్దలయ్యేలా సౌదీపై ప్రతీకారం తీర్చుకుంటాం..
భూమి బద్దలయ్యేలా సౌదీపై ప్రతీకారం తీర్చుకుంటాం..
82 ఏళ్ల వృద్ధుడి ఖాతాలో 759 కోట్ల రూపాయలు జమ.. అసలేం జరిగిందంటే..
82 ఏళ్ల వృద్ధుడి ఖాతాలో 759 కోట్ల రూపాయలు జమ.. అసలేం జరిగిందంటే..