Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి పోస్టాఫీసుల నుంచి రైలు టికెట్ల బుకింగ్‌..!

Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టెక్నాలజీ పెరుగుతున్న..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి పోస్టాఫీసుల నుంచి రైలు టికెట్ల బుకింగ్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 13, 2022 | 2:09 PM

Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా రైల్వే ప్రయాణికులకు మరిన్ని సదుపాయాలను అందిస్తోంది. ఇప్పుడు తాజాగా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు రైలు టికెట్లు బుకింగ్‌ చేసుకునేందుకు మరింత సులభతరం చేసింది. ఇక నుంచి రైలు టికెట్లు పోస్టాఫీసుల్లో కూడా బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇందుకోసం టికెట్ బుకింగ్‌ను నిర్వహించే సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.

ఇప్పుడు మీరు రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి క్యూలైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. మీరు మీ సమీపంలోని పోస్టాఫీసును సందర్శించడం ద్వారా కూడా రైలు టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. వాస్తవానికి భారతీయ రైల్వే ప్రయాణీకుల సౌకర్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోస్టాఫీసు నుండి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది రైల్వే శాఖ. రైలు టికెట్లను రిజర్వేషన్‌ చేసుకోవాలంటే పోస్టాఫీసుల నుంచి కూడా చేసుకోవచ్చు.

పోస్టాఫీసుల నుంచి బుక్‌ చేసుకునే సదుపాయం ముందుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించింది ఐఆర్‌సీటీసీ. రాష్ట్రంలో సుమారు 9147 పోస్టాఫీసులలో టిక్కెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో తీసుకువచ్చింది. ఈ సదుపాయాన్ని ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. రాష్ట్ర రాజధానిలోని స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోమతి నగర్ రైల్వే స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన రెండవ ప్రవేశ ద్వారం సహా టెర్మినల్ సౌకర్యాలు, కోచింగ్ కాంప్లెక్స్‌ను రైల్వే మంత్రి ప్రారంభించారని ఉత్తర మధ్య రైల్వే (ఎన్‌సిఆర్) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివం శర్మ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Pensioners Life Certificate: పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. కోట్లాది మందికి ప్రయోజనం.. ఆ గడువు పొడిగింపు.!

Vodafone idea: వొడాఫోన్‌ ఐడియా కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి 35.8 శాతం వాటా

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే