Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు టికెట్ తీసుకున్న తర్వాత కూడా ప్లాట్‌ఫారమ్‌పై ఉంటే జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు

భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యం కొన్ని నియమాలను రూపొందించింది. ఎవరైనా రైల్వే నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. దీనితో పాటు శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. ఈ నిబంధనలలో ఒకదాని గురించి సమాచారం తెలుసుకుందాం. రైలు టిక్కెట్టు ఉన్నా జరిమానా విధించవచ్చు. అసలైన మీరు రైలు టికెట్ తీసుకొని రైలు కోసం వేచి ఉన్నట్లయితే, మీరు రైలు కోసం ఎంతసేపు వేచి ఉండవచ్చో కూడా కాల పరిమితి ఉంటుంది. ఈ సమయం రాత్రి, పగటికి భిన్నంగా ఉంటుంది..

Indian Railways: రైలు టికెట్ తీసుకున్న తర్వాత కూడా ప్లాట్‌ఫారమ్‌పై ఉంటే జరిమానా.. రైల్వే కొత్త నిబంధనలు
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Aug 03, 2023 | 3:58 PM

భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యం కొన్ని నియమాలను రూపొందించింది. ఎవరైనా రైల్వే నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. దీనితో పాటు శిక్ష విధించే నిబంధన కూడా ఉంది. ఈ నిబంధనలలో ఒకదాని గురించి సమాచారం తెలుసుకుందాం. రైలు టిక్కెట్టు ఉన్నా జరిమానా విధించవచ్చు. అసలైన మీరు రైలు టికెట్ తీసుకొని రైలు కోసం వేచి ఉన్నట్లయితే, మీరు రైలు కోసం ఎంతసేపు వేచి ఉండవచ్చో కూడా కాల పరిమితి ఉంటుంది. ఈ సమయం రాత్రి, పగటికి భిన్నంగా ఉంటుంది. అయితే, రైలు ఆలస్యమైతే, ఈ నియమం, సమయ పరిమితిని మార్చడం సాధ్యమవుతుంది. ఈ నిబంధనలు పాటించినట్లయితే భారీ జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

ప్లాట్‌ఫారమ్‌పై రైలు వేచి ఉండే సమయం ఎంత?

మీ రైలు పగటి సమయంలో ఉంటే మీరు ట్రైన్‌ సమయానికి 2 గంటల ముందు రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. మరోవైపు మీ రైలు రాత్రి అయితే, మీరు 6 గంటల ముందు ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుని వేచి ఉండండి. ఈ సమయంలో మీరు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఈ సమయానికి ముందే ప్లాట్‌ఫారమ్‌కు చేరుకుంటే టీటీఈ మీ నుంచి జరిమానా వసూలు చేయవచ్చు.

ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ అవసరం:

మరోవైపు మీరు ఈ సమయ వ్యవధి కంటే ప్లాట్‌ఫారమ్‌పై ఎక్కువ సమయం గడపాలనుకుంటే, మీరు ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ తీసుకోవాలి. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ తీసుకున్న తర్వాత మీరు ఆ రోజు వరకు ప్లాట్‌ఫారమ్‌పై గడపవచ్చు. ఇందు కోసం టీటీఈ ఎలాంటి జరిమానా విధించరు. మీరు అలా చేయడంలో విఫలమైతే, మీ నుంచి జరిమానా వసూలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ నిబంధన ఎందుకు రూపొందించారు

ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే ఈ నిబంధనను రూపొందించింది. ఒక ప్రయాణికుడు రాత్రిపూట రైలు దిగి, భద్రత కోసం ఇంటికి వెళ్లే బదులు అతను 6 గంటలపాటు ప్లాట్‌ఫారమ్‌పై ఉండవచ్చు. మరోవైపు చాలా దూరాలకు ఒక రైలు నుంచి దిగిన తర్వాత మరొక రైలు కోసం వేచి ఉండటం 2 గంటల వరకు వేచి ఉండవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి