ITR Filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో క్లైయిమ్‌ కోసం నకిలీ అద్దె రశీదులు సమర్పిస్తున్నారా..? జాగ్రత్త.. 200 శాతం పెనాల్టీ

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు జూలై 31, 2023తో ముగిసింది. పన్ను ఎగవేత కోసం ఫేక్‌ అద్దె రసీదులను ఉపయోగిస్తున్న నేపథ్యంలో పన్ను శాఖ కీలక అడుగులు వేస్తోంది. వ్యత్యాసాలను గుర్తించినట్లయితే తప్పుగా నివేదించబడిన ఆదాయంపై వర్తించే పన్నులో 200 శాతం వరకు జరిమానా విధించే అధికారం శాఖకు ఉందని నిపుణులు అంటున్నారు. డాక్యుమెంటరీ సాక్ష్యం ద్వారా తప్పుడు సమాచారం అందించినట్లయితే ఆదాయాన్ని తప్పుగా నివేదించినట్లు పరిగణిస్తారు..

ITR Filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో క్లైయిమ్‌ కోసం నకిలీ అద్దె రశీదులు సమర్పిస్తున్నారా..? జాగ్రత్త.. 200 శాతం పెనాల్టీ
ITR Filing
Follow us
Subhash Goud

|

Updated on: Aug 02, 2023 | 8:05 PM

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు జూలై 31, 2023తో ముగిసింది. పన్ను ఎగవేత కోసం ఫేక్‌ అద్దె రసీదులను ఉపయోగిస్తున్న నేపథ్యంలో పన్ను శాఖ కీలక అడుగులు వేస్తోంది. వ్యత్యాసాలను గుర్తించినట్లయితే తప్పుగా నివేదించబడిన ఆదాయంపై వర్తించే పన్నులో 200 శాతం వరకు జరిమానా విధించే అధికారం శాఖకు ఉందని నిపుణులు అంటున్నారు.

ఇంటి అద్దె భత్యం (HRA), విరాళాలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టం కొన్ని పన్ను మినహాయింపులు, తగ్గింపులను అందిస్తుంది. హెచ్‌ఆర్‌ఏ నుంచి అటువంటి మినహాయింపును క్లెయిమ్ చేయడానికి పన్ను చెల్లింపుదారు పేర్కొన్న మినహాయింపుల కోసం నకిలీ అద్దె రసీదును సమర్పించినట్లయితే సమస్యల్లో పడవచ్చు. నకిలీ అద్దె రసీదు లేదా విరాళాల తప్పుడు మినహాయింపు తీసుకోవడం వల్ల చెల్లుబాటు అయ్యే పత్రాలు, అద్దె చెల్లింపుల రుజువు, చేసిన విరాళాల రుజువు మొదలైన వాటి కోసం పన్ను నోటీసు వస్తుంది.

డాక్యుమెంటరీ సాక్ష్యం ద్వారా తప్పుడు సమాచారం అందించినట్లయితే ఆదాయాన్ని తప్పుగా నివేదించినట్లు పరిగణిస్తారు. ఏదైనా తప్పుడు నివేదికలు సమర్పించినట్లయితే చెల్లించాల్సిన పన్నులో 200 శాతానికి సమానమైన మొత్తం జరిమానా విధించడం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయాన్ని సెక్షన్ 270A కింద విధించవచ్చు అని DVS అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు, సీఈవో దివాకర్ విజయసారథి తెలిపారు.

ఇవి కూడా చదవండి

దీనితో పాటు, పన్ను, కన్సల్టింగ్ సంస్థ ఏకేఎం గ్లోబల్‌లోని టాక్స్ మార్కెట్ హెడ్ యీషు సెహగల్ మాట్లాడుతూ.. నకిలీ అద్దె రసీదులను సమర్పించినట్లయితే పన్ను అధికారి ఆదాయాన్ని తిరిగి లెక్కించే సమయంలో వడ్డీ చిక్కులు కూడా ఉండవచ్చు. ఇలా చేసినందుకు కేసుల పాలు కావచ్చు. అలాగే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని సెహగల్ తెలిపారు. అంతేకాకుండా, నకిలీ లేదా తప్పుడు పత్రాలు సమర్పించడం, అలాగే తప్పుడు డాక్యుమెంటరీ సాక్ష్యాల ఆధారంగా నమోదు చేసినట్లయితే చిక్కుల్లో పడిపోతారని గుర్తించుకోండి. అయితే విచారణ సమయంలో మీ తప్పులను గుర్తించబడితే రూ. 10,000 జరిమానా లేదా పన్ను ఎగవేత కింద సెక్షన్ 271AAD కింద ఏది ఎక్కువ అయితే అది ఉంటుంది. ఇందుకే ఆదాయపు పన్ను విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పన్ను నుంచి తప్పించుకునేందుకు తప్పుడు సమాచారం అందించినట్లయితే పెద్ద సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి