AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: అవయవ దానాన్ని ప్రోత్సహించేలా భారతీయ రైల్వే చర్యలు.. అసలు విషయం ఏంటంటే..?

అవయవ దానం చేయడం అంటే మనం ఇంకో ప్రాణం నిలబెట్టినట్టేనని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తూ భారతదేశంలో అవయవదానమంటే భయపడుతూ ఉంటారు. కానీ, కావాల్సిన వారికి కష్టం వస్తే ఏదైనా చేసి బతికించాలనే తలంపుతో తమ సొంత వారికి కిడ్నీ, లివర్ వంటి వాటిని దానం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భారతీయ రైల్వే అవయవదానం చేసిన ఉద్యోగులకు ప్రోత్సహించేలా కీలక చర్యలు తీసుకుంది.

Indian Railways: అవయవ దానాన్ని ప్రోత్సహించేలా భారతీయ రైల్వే చర్యలు.. అసలు విషయం ఏంటంటే..?
Organ Donation
Nikhil
|

Updated on: Jul 21, 2024 | 3:15 PM

Share

అవయవ దానం చేయడం అంటే మనం ఇంకో ప్రాణం నిలబెట్టినట్టేనని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తూ భారతదేశంలో అవయవదానమంటే భయపడుతూ ఉంటారు. కానీ, కావాల్సిన వారికి కష్టం వస్తే ఏదైనా చేసి బతికించాలనే తలంపుతో తమ సొంత వారికి కిడ్నీ, లివర్ వంటి వాటిని దానం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భారతీయ రైల్వే అవయవదానం చేసిన ఉద్యోగులకు ప్రోత్సహించేలా కీలక చర్యలు తీసుకుంది. అవయవదానం చేసిన వారికి 42 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అవయవాలను దానం చేసే రైల్వే ఉద్యోగులు 42 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్‌కు అర్హులని ప్రకటించింది.  ఈ నేపథ్యంలో రైల్వే శాఖ తీసుకున్న తాజా చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గత సంవత్సరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదించి అవయవ దాతలకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరుకు సంబంధించి సూచనలను జారీ చేసింది. దాత నుంచి అవయవాన్ని తొలగించడం ఒక పెద్ద శస్త్రచికిత్స అని ఆసుపత్రిలో చేరడంతో పాటు ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా కోలుకోవడానికి సమయం అవసరమని డీఓపీటీ తెలిపింది. రైల్వే ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని పొడిగిస్తూ అవయవ దానం మరొక మానవునికి సహాయం చేయడానికి ఒక గొప్ప కార్యకలాపం కాబట్టి స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రజా ప్రయోజనాల కోసం ఒక సంక్షేమ చర్య అని రైల్వే బోర్డు పేర్కొంది. గత వారం జారీ చేసిన ఉత్తర్వులో డాక్టర్ సిఫారసుపై దాత అవయవాన్ని తొలగించడానికి శస్త్రచికిత్స రకంతో సంబంధం లేకుండా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తామని రైల్వే శాఖ ఉద్యోగులకు సమాచారం అందించింది. అయితే అవయవ మార్పిడి శస్త్రచికిత్స రైల్వే ఆసుపత్రిలో లేదా ఎంపానెల్ చేయబడిన ప్రైవేట్ సంస్థలో జరిగిన షరతుకు ఈ సౌకర్యం లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. 

మానవ అవయవాల మార్పిడి చట్టం, 1994 ప్రకారం సమర్థ వైద్య అధికారం ద్వారా దాత విరాళం కోసం సక్రమంగా ఆమోదిస్తే అన్ని రకాల జీవన దాతలకు సెలవు మంజూరు చేస్తామని పేర్కొంది. స్పెషల్ క్యాజువల్ లీవ్ శస్త్రచికిత్సకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితుల మినహా మరే ఇతర సెలవులతో కలిపి ఉండకూడదని పేర్కొంది.  భారతీయ రైల్వేలో ప్రస్తుతం దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ నిర్ణయం వారందరిలో అవయవదానంపై అవగాహన కలుగజేస్తుంది. అయితే మరణించిన అవయవ దాతల బంధువులను గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది.  అధికారిక వర్గాల ప్రకారం ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ ఒక కమ్యూనికేషన్‌లో మరణించిన అవయవ దాతలందరికీ, అతని/ఆమె కుటుంబ సభ్యునికి శాలువా, ఫ్రేమ్‌తో కూడిన సర్టిఫికేట్ ఇచ్చి అవయవ దాత చిత్రపటం వద్ద నివాళులర్పించవచ్చని పేర్కొంది. సంబంధిత స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్‌లోని ఇద్దరు సిబ్బంది లేదా ప్రభుత్వ వైద్య కళాశాల/ఆసుపత్రికి చెందిన స్థానిక ప్రతినిధులు దాత ఆసుపత్రి/ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను సత్కరించాలని సూచించారు. మరణించిన అవయవ దాతకు సంబంధించిన గౌరవప్రదమైన అంత్యక్రియల ఖర్చులను కవర్ చేయడానికి జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం మార్గదర్శకాల రూ.10,000 మంజూరు చేస్తారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..