AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు టికెట్‌పై ఉండే ఈ 5 అంకెలను గమనించారా.. ఇందులో ఉండే సమాచారం ఏంటో తెలుసా!

మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మీరెప్పుడైనా రైలు టిక్కెట్‌పై ఉండే 5 అంకెల సంఖ్యను గమనించారా..!

Indian Railways: రైలు టికెట్‌పై ఉండే ఈ 5 అంకెలను గమనించారా.. ఇందులో ఉండే సమాచారం ఏంటో తెలుసా!
Railway Ticket
Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 11, 2023 | 9:59 AM

Share

మీరు తరచూ రైలు ప్రయాణం చేస్తుంటారా.? అయితే ఈ వార్త మీకోసమే. మీరెప్పుడైనా రైలు టిక్కెట్‌పై ఉండే 5 అంకెల సంఖ్యను గమనించారా..! హా.. అవును ట్రైన్ నెంబర్ కదా.. అని అనుకునేరు. కానీ ఆ 5 అంకెల సంఖ్య వెనుక ఇంకా చాలా సమాచారం దాగి ఉంది. ఈ నెంబరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాలను మాత్రమే కాదు.. రైలు స్థితి, దాని గతి అన్నీ తెలుసుకోవచ్చు. కేవలం 5 అంకెల సంఖ్యలోనే ఇంత సమాచారం దాగి ఉందంటే ఆశ్చర్యం కలుగుతోంది కదూ. కానీ ఇది నిజమే. వాస్తవానికి ప్రతి రైలుకు ప్రత్యేక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ దాని గుర్తింపును తెలియజేస్తుంది. ఈ అంకెలు 0 నుంచి 9 వరకు ఉండవచ్చు. ఉదాహరణకు 0 అంటే ఈ రైలు స్పెషల్ ట్రైన్ అని అర్థం. (వేసవి స్పెషల్, హాలిడే స్పెషల్ లేదా ఇతర స్పెషల్ కేటగిరీకి చెందినది)

1 నుంచి 4 వరకు అంకెల అర్ధం ఏంటంటే.?

మొదటి అంకె 1 లేదా 2 ఉంటే రైలు చాలా దూరం వెళుతుందని అర్థం. ఈ రైలు రాజధాని, శతాబ్ది, జన్ సాధర్, సంపర్క్ క్రాంతి, గరీబ్ రథ్, దురంతో అయి ఉండొచ్చు. అలాగే మొదటి అంకె 3 అయితే ఈ రైలు కోల్‌కతా సబ్ అర్బన్ రైలు అని అర్థం. మరి మొదటి అంకె 4 అయితే అది న్యూఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్, ఇతర మెట్రో నగరాల సబ్ అర్బన్ రైలు అని అర్థం.

ఇవి కూడా చదవండి

5 నుంచి 9 వరకు అంకెల అర్థం..

మొదటి అంకె 5 అయితే అది ప్యాసింజర్ రైలు. మొదటి అంకె 6 అయితే అది MEMU రైలు. మొదటి అంకె 7 అయితే అది DEMU రైలు. మొదటి అంకె 8 అయితే అది రిజర్వ్ రైలు. మొదటి అంకె 9 అయితే అది ముంబై సబ్ అర్బన్ రైలు. రైలు మొదటి అక్షరం 0, 1, 2తో ప్రారంభమైతే మిగిలిన నాలుగు అక్షరాలు రైల్వే జోన్, డివిజన్‌ను సూచిస్తాయి.

0- కొంకణ్ రైల్వే

1- సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, నార్త్ సెంట్రల్ రైల్వే

2- సూపర్‌ఫాస్ట్, శతాబ్ది, జన శతాబ్ది. ఈ రైళ్ల నెక్స్ట్ డిజిట్స్ జోన్ కోడ్‌ను సూచిస్తాయి

3- ఈస్ట్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే 4- ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే

5- జాతీయ తూర్పు రైల్వే, ఈశాన్య సరిహద్దు రైల్వే

6- దక్షిణ రైల్వే, దక్షిణ పశ్చిమ రైల్వే

7- దక్షిణ మధ్య రైల్వే, దక్షిణ పశ్చిమ రైల్వే

8- దక్షిణ తూర్పు రైల్వే, ఈస్ట్ కోస్టల్ రైల్వే

9- పశ్చిమ రైల్వే, నార్త్ వెస్టర్న్ రైల్వే, పశ్చిమ మధ్య రైల్వే

ఇవి మాత్రమే కాదు.. రైలు టికెట్‌పై మొదటి అంకె 5,6,7లో ఏదో ఒకటైతే.. రెండవ అంకె జోన్‌ను, మిగిలిన అంకెలు డివిజన్ల కోడ్‌ను సూచిస్తాయని అర్ధం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ