AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు ప్రయాణంలో పిల్లలకు టిక్కెట్‌ తీసుకోవాలా? అవసరం లేదా? రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

భారతీయ రైల్వేలో పిల్లల టిక్కెట్ నిబంధనలు తెలుసుకోండి. ఐదేళ్ల లోపు పిల్లలకు బెర్త్ అవసరం లేకపోతే ప్రయాణం ఉచితం. బెర్త్ కావాలంటే పూర్తి ఛార్జీ వర్తిస్తుంది. 5-12 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక బెర్త్ వద్దనుకుంటే సగం ఛార్జీ, బెర్త్ కావాలంటే పూర్తి ఛార్జీ చెల్లించాలి. 12 ఏళ్లు పైబడిన వారికి పూర్తి టిక్కెట్ తప్పనిసరి.

రైలు ప్రయాణంలో పిల్లలకు టిక్కెట్‌ తీసుకోవాలా? అవసరం లేదా? రూల్స్‌ ఏం చెబుతున్నాయి?
Indian Railways Children's
SN Pasha
|

Updated on: Nov 11, 2025 | 6:58 PM

Share

మన దేశంలో ప్రతి రోజు కొన్ని లక్షల మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అలాగే టూర్లకు వెళ్లాలన్న కూడా ఎక్కువ మంది ఇండియన్‌ రైల్వేస్‌నే ఆశ్రయిస్తారు. తక్కువ ధరతో సౌకర్యవంతమైన ప్రయాణమే అందుకు ప్రధాన కారణం. అయితే రైళ్లలో ప్రయాణించాలంటే టిక్కెట్‌ తీసుకోవాలి, లేదా ముందుగానే రిజర్వేషన్‌ చేయించుకోవాలి, ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు కచ్చితంగా రిజర్వేషన్‌ చేయించుకుంటూ ఉంటారు. అయితే పెద్దలకు కచ్చితంగా టిక్కెట్‌ లేదా రిజర్వేషన్‌ ఉండాలి. అందులో ఎలాంటి డౌట్‌ లేదు. కానీ, పిల్లల విషయంలోనే చాలా మందికి క్లారిటీ ఉండదు. ఏ వయసు పిల్లలకు టిక్కెట్‌ తీసుకోవాలి? ఒక వేళ చిన్న పిల్లలకు బెర్త్‌ కావాలంటే ఏం చేయాలనే విషయంలో చాలా మందికి అవగాహన ఉండదు. అసలు పిల్లల టిక్కెట్లపై రూల్స్‌ ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఈ నిబంధనకు మినహాయింపు ఉంది. కాబట్టి తల్లిదండ్రులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే ముందు పిల్లల ఛార్జీల నియమాలతో తమను తాము తెలుసుకోవాలి.

పిల్లల టికెట్ వయో పరిమితి

  • 5 సంవత్సరాల లోపు ప్రయాణం ఉచితం (ప్రత్యేక బెర్త్ అవసరం లేదు)
  • 5 నుండి 12 సంవత్సరాల కంటే తక్కువ బెర్త్/సీటు అవసరం లేదంటు పిల్లల ఛార్జీ
  • ప్రత్యేక బెర్త్/సీటు కావాలా? పెద్దలకు ఎంత ఛార్జ్‌ తీసుకుంటారో అంత చెల్లించాలి.
  • 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉంటే పూర్తి వయోజన ఛార్జీ చెల్లించాలి

మార్చి 6, 2020న రైల్వే మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. “…ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఉచితంగా తీసుకెళ్లాలి. అయితే ప్రత్యేక బెర్త్ లేదా సీటు (చైర్ కార్‌లో) ఇవ్వరు. అందువల్ల ప్రత్యేక బెర్త్ క్లెయిమ్ చేయకపోతే ఏదైనా టికెట్ కొనుగోలు అవసరం లేదు. అయితే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు స్వచ్ఛందంగా బెర్త్/సీటు కోరితే పూర్తి వయోజన ఛార్జీ వసూలు చేస్తారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us