Indian Railway Rules: రైళ్లో లోయర్ బెర్త్ నియమ నిబంధనలు ఏంటో తెలుసా? ఇక ఆ సీటు వారిదే!

ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే మెరుగైన సేవలు అందించే విధంగా పలు నియమ నిబంధనలు మారుస్తోంది రైల్వే శాఖ. అయితే సాధారణం ఐఆర్‌సీటీసీ,లేదా ఇతర వెబ్‌సైట్ల నుంచి టికెట్స్‌ బుక్‌ చేసుకునే సమయంలో కావాల్సిన సీట్లను బుక్‌ చేసుకుంటాము. కావాల్సిన సీటు పొందేందుకు నెల ముందే బుక్ చేసుకుంటుంటారు. ఎందుకంటే చాలామందికి లోయర్ బెర్త్..

Indian Railway Rules: రైళ్లో లోయర్ బెర్త్ నియమ నిబంధనలు ఏంటో తెలుసా? ఇక ఆ సీటు వారిదే!
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Feb 17, 2024 | 11:36 AM

చాలా మంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. కానీ రైల్వేకు సంబంధించి కొన్ని రూల్స్‌ పెద్దగా తెలిసి ఉండదు. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది ఇండియన్‌ రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం భారత రైల్వే కొత్త కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. అలాగే మెరుగైన సేవలు అందించే విధంగా పలు నియమ నిబంధనలు మారుస్తోంది రైల్వే శాఖ. అయితే సాధారణం ఐఆర్‌సీటీసీ,లేదా ఇతర వెబ్‌సైట్ల నుంచి టికెట్స్‌ బుక్‌ చేసుకునే సమయంలో కావాల్సిన సీట్లను బుక్‌ చేసుకుంటాము. కావాల్సిన సీటు పొందేందుకు నెల ముందే బుక్ చేసుకుంటుంటారు. ఎందుకంటే చాలామందికి లోయర్ బెర్త్ లేదాసైడ్ లోయర్ కోసం ఇష్టపడుతుంటారు.  కానీ ఇక నుంచి ఆ సీట్లు సాధ్యం కాకపోవచ్చు.  ఇటీవల ఇండియన్ రైల్వేస్ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇండియన్ రైల్వేస్ జారీ చేసిన కొత్త రూల్స్ ప్రకారం.. రైళ్లలో లోయర్ బెర్త్ అనేది ఇకపై కొన్ని కేటగరీలకే రిజర్వ్ చేయబడిన సీట్లు . వికలాంగులకు మాత్రమే లోయర్ బెర్త్ రిజర్వ్  చేయడం జరుగుతుంది. ట్రైన్లలో వికలాంగులకు కేటాయించేలా  రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రైల్వే శాఖ ఆదేశాల ప్రకారం నాలుగు సీట్లు, రెండు బోటమ్, రెండు మిడిల్ సీట్లు, ధర్డ్ ఏసీలో రెండు, ధర్డ్ ఏసీ ఎకానమీలో రెండు సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేశారు. ఆ వికలాంగుడికి తోడుగా ప్రయాణించే మరొకరు కూడా ఆ సీట్లో కూర్చోవచ్చు. అదే విధంగా 2 లోయర్, 2 అప్పర్ సీట్లు గరీభ్ రధ్‌లో వికలాంగులసు కేటాయించారు. వీటికి ఎలాంటి రాయితీ ఉండదు. పూర్తి రసుము చెల్లించాల్సిందే.

ఇవి కాకుండా సీనియర్ సిటిజన్లకు కూడా లోయర్ బెర్త్ రిజర్వ్ చేసింది రైల్వే శాఖ. వృద్ధులకు అడగకుండానే కేటాయిస్తారు. స్లీపర్ తరగతిలో 6-7, ధర్డ్ ఏసీలో 4-5, సెకెండ్ ఏసీలో 3-4 సీట్లను 45 ఏళ్లు పైబడినవారికి లేదా గర్భిణీ మహిళలకు కేటాయించారు. ఆప్షన్ ఎంచుకోకపోయినా ఈ సీట్లను వారికి కేటాయిస్తారు. మరోవైపు లోయర్ సీటు ఒకవేళ సీనియర్ సిటిజన్ కు కేటాయించి ఉండి, దివ్యాంగులు లేదా గర్భిణీ మహిళకు అప్పర్ సీట్ ఉంటే టీటీకు సీటు మార్చే అధికారముంటుంది. అందుకే మీరు రైలు ప్రయాణం చేసే సమయంలో సీట్ల విషయంలో నియమ నిబంధనలు తెలిసి ఉండాలి. ఒక వేళ మీరు ఈ సీట్లను బుక్‌ చేసుకుంటే ఒక వేళ కేటాయించకపోవచ్చు. అర్హులైన వారికి మాత్రమే ఈ సీట్లను కేటాయించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి