Indian Railways: రైలు టికెట్ కన్ఫర్మ్ అయ్యాక క్యాన్షియల్ చేసుకుంటే ఎంత రీఫండ్ వస్తుంది? రైల్వే రూల్స్ ఏంటి?
Indian Railways: రైలు టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు పూర్తి రిఫండ్ పొందాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. రైలు రద్దు అయినప్పుడు, లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ కానప్పుడు పూర్తి డబ్బు తిరిగి వస్తుంది. అయితే కన్ఫర్మ్ అయిన..

Indian Railways: చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. అయితే రైలు ప్రయాణం కోసం ముందుగా ఐఆర్‌సీటీసీలో టికెట్స్ బుక్ చేసుకుంటాము. టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్షిల్ చేస్తుంటాము. మరి బుక్ అయిన టికెట్లు రద్దు చేసుకుంటే రీఫండ్ ఎంత వస్తుం? పూర్తిగా వస్తుందా? లేదా ఏవైనా ఛార్జీలు కట్ అవుతాయా.. తెలుసుకుందాం..
రైలు టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు పూర్తి రిఫండ్ పొందాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. రైలు రద్దు అయినప్పుడు, లేదా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ కానప్పుడు పూర్తి డబ్బు తిరిగి వస్తుంది. అయితే కన్ఫర్మ్ అయిన టికెట్లను మీరు రద్దు చేసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉంటాయి. పూర్తి రిఫండ్ రాదు.
పూర్తి రిఫండ్ వచ్చే సందర్భాలు:
- రైలు రద్దు అయినప్పుడు: అదేనా కారణంగా రైలు రద్దు చేసినట్లయితే మీరు చెల్లించిన పూర్తి ఛార్జీని తిరిగి పొందవచ్చు.
- వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ కానప్పుడు: మీరు బుక్ చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్, ఫస్ట్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా కన్ఫర్మ్ అవ్వకపోతే ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు పూర్తి రిఫండ్ వస్తుంది.
- RAC టికెట్ పూర్తిగా కన్ఫర్మ్ కానప్పుడు: కొంతమంది ప్రయాణికులకు RAC వచ్చినప్పుడు మిగిలిన వారికి వెయిటింగ్ లిస్ట్ వస్తే టికెట్‌ను ఆన్‌లైన్‌లో TDR (టికెట్ డిపాజిట్ రసీదు) ఫైల్ చేసి రద్దు చేస్తే, కన్ఫర్మ్ అయిన ప్రయాణికులకు కూడా పూర్తి రిఫండ్ వస్తుంది.
- కన్ఫర్మ్ టికెట్లు: కన్ఫర్మ్ అయిన టికెట్లను మీరు సొంతంగా రద్దు చేసుకుంటే, నిర్ణీత సమయ పరిమితిని బట్టి క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉంటాయి.
- తత్కాల్ టికెట్లు: కన్ఫర్మ్ అయిన తత్కాల్ టికెట్లను రద్దు చేసుకుంటే ఎలాంటి రిఫండ్ ఉండదు.
- TDR ఫైలింగ్: కొన్ని సందర్భాల్లో టికెట్ రద్దుకు సంబంధించి TDR (టికెట్ డిపాజిట్ రసీదు) ఫైల్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాక్షికంగా కన్ఫర్మ్ అయిన టికెట్ల విషయంలో..
ఇది కూడా చదవండి: Gold Price Today: హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతో తెలుసా? పసిడి రేట్లు మరింత పెరగనున్నాయా?
కన్ఫర్మ్‌డ్ టికెట్ల క్యాన్సిలేషన్ రూల్స్..
టికెట్ కన్ఫర్మ్‌డ్ ట్రైన్ టికెట్లకు అయితే మీరు టికెట్లు బుక్ చేశాక ఎన్ని రోజులకు.. ఇంకా ట్రైన్ బయల్దేరే ఎంత సమయం ముందు క్యాన్సిల్ చేశారనే దాన్ని బట్టి ఉంటుంది. ట్రైన్ బయల్దేరే 48 గంటలకు ముందే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఛార్జీలు ఇలా ఉంటాయి.
ఏసీ ఫస్ట్ క్లాస్/ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు అయితే రూ. 240 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ఏసీ2 టైర్/ఫస్ట్ క్లాస్‌కు అయితే రూ. 200 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ఏసీ 3 టైర్/ఏసీ ఛెయిర్ కార్/ఏసీ 3 ఎకానమీలో టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే రూ. 180 ప్లస్ జీఎస్టీ పడుతుంది. స్లీపర్ క్లాస్ అయితే రూ. 120, సెకండ్ క్లాస్‌కు అయితే రూ. 60 క్యాన్సిలేషన్ ఛార్జీ పడుతుంది. ఇది ఒక ప్యాసింజర్‌కు పడే ఛార్జీలు అని గుర్తుంచుకోవాలి.
ఇది కూడా చదవండి: ITR Filing 2025: మీరు ఈ తప్పు చేస్తే రీఫండ్ రావడానికి 9 నెలలు పట్టవచ్చు
ఇక రైలు బయల్దేరే 48 గంటల నుంచి 12 గంటల మధ్యలో అయితే టికెట్ రద్దు ఛార్జీలు టికెట్ ఫేర్‌లో 25 శాతం పడుతుంది. ఇక్కడ ఏసీ తరగతికి అయితే కనీస ఛార్జ్ ప్లస్ జీఎస్టీ విధిస్తారు. ఈ లెక్కన చూస్తే రుసుములు ఉంటాయి. మిగతా మొత్తం రిఫండ్ అవుతుంది.
ఇక టికెట్ కన్ఫర్మ్ అయ్యాక .. ట్రైన్ బయల్దేరే 12 గంటల నుంచి 4 గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేస్తే.. ఇక్కడ టికెట్ ధరలో నుంచి 50 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీ పడుతుంది. ఇక ట్రైన్ బయల్దేరే 4 గంటల్లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ రాదు. టికెట్ ధర మొత్తం కోల్పోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మీ టికెట్ ధర రూ.170 అయితే 20 రోజుల ముందుగానే బుక్ చేసుకుని వెంటనే క్యాన్షిల్ చేసుకుంటే కనీసం 60 రూపాయలు కట్ చేసుకుని మిగతా అమౌంట్ రీఫండ్ అవుతుందని నివేదికల ద్వారా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ధర రూ.1,25,000లకు పెరగనుందా? ఆందోళన రేపుతున్న బ్యాంకు రిపోర్ట్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








