AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Sugar Export: భారతదేశం భారీగా పెరిగిన చక్కెర ఉత్పత్తి.. విదేశాల నుంచి డిమాండ్ పెరగడమే కారణం..!

India Sugar Export:అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో దేశంలోని చక్కెర ఎగుమతులు దాదాపు నాలుగు రెట్లు పెరిగి 17 లక్షల టన్నులకు..

India Sugar Export: భారతదేశం భారీగా పెరిగిన చక్కెర ఉత్పత్తి.. విదేశాల నుంచి డిమాండ్ పెరగడమే కారణం..!
Subhash Goud
|

Updated on: Jan 18, 2022 | 10:30 AM

Share

India Sugar Export:అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో దేశంలోని చక్కెర ఎగుమతులు దాదాపు నాలుగు రెట్లు పెరిగి 17 లక్షల టన్నులకు చేరుకుందని చక్కెర పరిశ్రమకు చెందిన సంస్థ ఇండియా షుగర్ మిల్స్ అసోసియేషన్ (ISMA) తెలిపింది. విదేశాల నుంచి డిమాండ్ పెరగడమే ఈ పెరుగుదలకు కారణం. ఇప్పటి వరకు చక్కెర మిల్లుల ద్వారా 38-40 లక్షల టన్నుల ఎగుమతులకు ఒప్పందం కుదిరింది. తదుపరి ఒప్పందాల కోసం మిల్లులు ఇప్పుడు గ్లోబల్ ధరలలో సవరణ కోసం ఎదురుచూస్తున్నాయి. చక్కెర మార్కెటింగ్ సంవత్సరం అక్టోబర్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుందని తెలిపింది. మార్కెట్ నివేదికలు, పోర్ట్ సమాచారం ప్రకారం.. అక్టోబర్ నుండి డిసెంబర్, 2021 కాలంలో సుమారు 17 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేయబడిందని తెలిపింది.

ఈ నెలలో దాదాపు ఏడు లక్షల టన్నుల చక్కెర ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందిందని ISMA తెలిపింది. బ్రెజిల్‌లో రాబోయే సెషన్ 2022-23 (ఏప్రిల్-మార్చి)లో ఊహించిన దాని కంటే మెరుగైన ఉత్పత్తి గురించి నివేదికలు వెలువడ్డాయని, ప్రపంచ ముడి చక్కెర ధరలు మరింత క్షీణించాయి.. ప్రస్తుతం 5 నెలల కనిష్ట స్థాయి 18 సెంట్లు వద్ద ట్రేడవుతున్నాయి అని అసోసియేషన్‌ తెలిపింది. భారతీయ మిల్లులు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయని, తదుపరి ఎగుమతి ఒప్పందాలపై సంతకం చేయడానికి తొందరపడటం లేదని , ఇప్పటివరకు 38-40 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఒప్పందాలు కుదిరాయని తెలిపింది.

151.41 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి

2021 అక్టోబర్ 1 నుంచి 2022 జనవరి 15 మధ్య 151.41 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసిందని, గత మార్కెటింగ్‌లో ఇదే కాలంలో 142.78గా ఉందని షుగర్ మిల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఏ రాష్ట్రంలో ఎంత

మహారాష్ట్రలోని చక్కెర మిల్లులు జనవరి 15, 2022 వరకు 58.84 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేశాయని, అంతకుముందు 51.55 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేశాయని ISMA తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో చక్కెర ఉత్పత్తి జనవరి 15 నాటికి 40.17 లక్షల టన్నులకు తగ్గింది. ఏడాది క్రితం ఇదే కాలంలో 42.99 లక్షల టన్నులు ఉంది. కర్ణాటకలో, చక్కెర ఉత్పత్తి జనవరి 15, 2022 నాటికి 33.20 లక్షల టన్నులకు పెరిగింది. ఇది మునుపటి సంవత్సరంలో ఇదే కాలంలో 29.80 లక్షల టన్నులుగా ఉంది.

ఇవి కూడా చదవండి:

Bank Charges: మీకు ఆ బ్యాంకులో అకౌంట్‌ ఉందా…? ఛార్జీల మోత.. తెలుసుకోండి పూర్తి వివరాలు..!

Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండర్‌