AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swiss Bank: పేర్లు, అడ్రస్‌తోపాటు భారతీయుల వివరాలు ఇవే.. 4వ జాబితాను విడుదల చేసి స్విస్ బ్యాంక్

స్విస్‌ బ్యాంక్‌..! ఈ పేరెత్తితే ఠక్కున గుర్తుకు వచ్చేది.. బ్లాక్‌ మనీ..!!! స్వదేశంలో సొమ్ములు కూడబెట్టుకొని కోట్లకు కోట్లు పడగలెత్తి.. పన్నులు ఎగవేస్తూ.. ఆ సొమ్మునంతా స్విస్‌ బ్యాంకుల్లోకి తరలిస్తున్నారు నల్ల కుబేరులు. బ్లాక్‌ మనీకి కేరాఫ్‌గా ఉండే స్విస్‌ బ్యాంకులు..అయితే ఆ బ్యాంకులో దాచుకున్న భారతీయుల వివరాలను వెల్లడించింది.

Swiss Bank: పేర్లు, అడ్రస్‌తోపాటు భారతీయుల వివరాలు ఇవే.. 4వ జాబితాను విడుదల చేసి  స్విస్ బ్యాంక్
Swiss Bank
Sanjay Kasula
|

Updated on: Oct 11, 2022 | 12:37 PM

Share

స్విస్‌బ్యాంక్‌ల్లో నల్లధనం గుట్టు భారత్‌కు మరోసారి చేరింది. స్విస్‌ ఖాతాలకు సంబంధించిన మరో జాబితా భారత ప్రభుత్వానికి అందింది. ఖాతాలకు సంబంధించి స్విస్‌ బ్యాంకులతో భారత ప్రభుత్వం చేసుకున్న చేసుకున్న ఒప్పందంతో ఈ జాబితా కేంద్రానికి అందింది. వార్షిక ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఏ) కింద స్విస్ బ్యాంక్ నాల్గవ సెట్ జాబితా వివరాలను భారత్‌కు అందించింది. భారత్ పేరుతో సహా 101 దేశాలతో సుమారు 34 లక్షల ఆర్థిక ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ పంచుకుంది. స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న భారతీయులు వివరాలను ఇందులో పొందుపర్చింది. ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను స్విస్ బ్యాంక్ షేర్ చేసింది. ఇందులో భారత ఖాతాదారులు ఎంత డబ్బు దాచుకున్నారు.. డిపాజిట్ చేసినవారి వివరాలతోపాటు ఇండియాలోని వారి అడ్రస్‌ కూడా ఇచ్చింది.

స్విస్ బ్యాంక్ సమాచారాన్ని షేర్ చేసింది..

గత నెలలో స్విస్ బ్యాంక్ ఈ సమాచారాన్ని భారతదేశంతో పంచుకున్నట్లు తెలిపింది. అందించిన వివరాల ప్రకారం వందలాది ఆర్థిక ఖాతాలకు లింకులు ఇందులో ఉన్నాయి. బహుళ ఖాతాలను కలిగి ఉన్న అనేక మంది పేర్లు ఇందులో ఉండటం విశేషం. ఈ నివేదిక ప్రకారం, పన్ను ఎగవేత, మనీలాండరింగ్, టెర్రర్ ఫండింగ్ వంటి చర్యలను దర్యాప్తు చేయడానికి భారత ప్రభుత్వం ఈ డేటా, సమాచారాన్ని ఉపయోగించుకుంటోంది.

భారతదేశంతో AEOIకి

స్విట్జర్లాండ్ అంగీకరించింది వార్షిక ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద స్విట్జర్లాండ్ భారతదేశంతో AEOIకి అంగీకరించింది. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టింది. అయితే దీని కింద ఇప్పటి వరకు భారతదేశం స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వ్యక్తుల పేర్లను నాలుగు సెట్లను పొందింది. ఈ డేటాను భాగస్వామ్యం చేయడానికి, డేటా రక్షణ , గోప్యతపై భారతదేశంలో అవసరమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ సమీక్షించింది. .

స్విస్ బ్యాంక్ షేర్ చేసిన సమాచారం ఏంటి..

అందులో బ్యాంక్ ఖాతాదారుని పేరు, చిరునామా, నివాస దేశం, పన్ను గుర్తింపు సంఖ్య, ఖాతా బ్యాలెన్స్, మూలధన ఆదాయానికి సంబంధించిన సమాచారంతో సహా స్విస్ బ్యాంక్ షేర్ చేసింది. స్విట్జర్లాండ్ సెప్టెంబరు 2023లో స్విస్ బ్యాంక్ సమాచారాన్ని భారత్‌తో పంచుకోబోతోంది. స్విస్‌ బ్యాంక్‌లో డబ్బు దాచుకున్న వాళ్ల అడ్రస్‌ , పేరు , ఫోన్‌ నెంబర్‌ , ట్యాక్స్‌ వివరాలు కూడా భారత ప్రభుత్వానికి అందాయి. 

స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న భారతీయులు స్వదేశంలో విధిగా పన్నులు చెల్లించారా ? అన్న విషయంపై కేంద్రం దర్యాప్తు చేస్తుంది. వచ్చే ఏడాది మరోసారి భారతీయుల జాబితాను కేంద్రానికి ఇస్తుంది స్విస్‌ ప్రభుత్వం.

స్విస్ బ్యాంక్ ఖాతా వివరాలు..

ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (FTA) ఈ సంవత్సరం సమాచార మార్పిడి జాబితాలోకి ఐదు కొత్త చేరికలను చూసింది. అల్బేనియా, బ్రూనై దారుస్సలాం, నైజీరియా, పెరూ మరియు టర్కీ. ఆర్థిక ఖాతాల సంఖ్య దాదాపు లక్ష పెరిగింది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం