AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E commerce: ఈ పండుగ సీజన్‌లో వాళ్లే తెగ కొనేశారంటా.. ఆసక్తికర విషయాలు వెల్లడి..

దసరా, దీపావళి ఇలా రెండు పెద్ద పండుగలు ఒకే నెలలో రావడంతో పెద్ద ఎత్తున వస్తువులను కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ-కామర్స్‌ సైట్లు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించడంతో ఏడాదంతా ఎదురు చూస్తున్న వాళ్లు ఈ సీజన్‌లోనే వస్తువులు కొనుగోలు చేశారు. అయితే..

E commerce: ఈ పండుగ సీజన్‌లో వాళ్లే తెగ కొనేశారంటా.. ఆసక్తికర విషయాలు వెల్లడి..
E Commerce Sites
Narender Vaitla
|

Updated on: Oct 11, 2022 | 12:32 PM

Share

దసరా, దీపావళి ఇలా రెండు పెద్ద పండుగలు ఒకే నెలలో రావడంతో పెద్ద ఎత్తున వస్తువులను కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఈ-కామర్స్‌ సైట్లు పెద్ద ఎత్తున ఆఫర్లను ప్రకటించడంతో ఏడాదంతా ఎదురు చూస్తున్న వాళ్లు ఈ సీజన్‌లోనే వస్తువులు కొనుగోలు చేశారు. అయితే సహజంగా షాపింగ్‌ చేసిన వారిలో ఎక్కువగా పెద్ద పెద్ద పట్టణాలకు చేసిన వారుంటారని అనుకుంటాం. కానీ దీనికి భిన్నంగా చిన్న నగరాల్లోనే ఎక్కువ షాపింగ్‌ జరిగిందని ప్రముఖ కన్సల్టెంట్‌ సంస్థ రెడ్‌సీర్‌ తెలిపింది. ఈ ఏడాది పండుగ సీజన్‌లో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై జరిగిన అమ్మకాల్లో దాదాపు 60 శాతం వాటాను చిన్న నగరాలే దక్కించుకున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.

దీని విలువ అక్షరాల రూ. 24,000 వేల కోట్లుగా తేలింది. ఇదిలా ఉంటే ఉంటే గతేడాది ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై మొత్తం అమ్మకాల్లో 50 శాతంతో టైర్ 2 పట్టణాలు మెట్రో, టైర్ 1 నగరాలతో సమానంగా అమ్మకాలను సాధించాయి. ఈఏడాది ఈ కామర్స్‌ సంస్థలు 27 శాతం వృద్ధితో రూ. 40,000 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేశాయి. ఈ మొత్తం ఒక్క ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ 62 శాతం వాటాను కలిగి ఉండడం విశేషం.

టైర్‌ 2 నగరాల్లో ఎక్కువగా షాపింగ్‌ చేవాశారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మీషో, జియోమార్ట్ వంటి కంపెనీల్లో జరిగిన విక్రయాల్లో టైర్‌ 2 నగరానికి చెందిన వారే చేయడం విశేషం. ఇక ప్రొడక్ట్‌ కంపెనీలు సైతం 50 శాతం కంటే ఎక్కువ మంది రెండు రెట్ల అమ్మకాల వృద్ధిని సాధించారని రెడ్‌సీర్‌ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. ధరల తగ్గింపు, ప్రమోషన్స్‌, డిస్కౌంట్‌లతో ఆన్‌లైన్‌ షాపింగ్ యాప్స్ ఇన్‌స్టాలేషన్‌లు కూడా 3 రెట్లు పెరిగాయని రెడ్‌సీర్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..