EV Scooters Under 1.5 Lakhs: పెరుగుతున్న ఈవీ స్కూటర్ల వినియోగం… రూ.1.5 లక్షల లోపు ఉన్న బెటర్‌ స్కూటర్లు ఇవే

మొదట్లో పట్టణ ప్రాంత ప్రజలే ఎక్కువగా ఈవీ వాహనాలను కొన్నప్పటికీ క్రమేపి గ్రామీణ ప్రాంతాల వారు కూడా ఈవీ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. వాహన నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుండడం, పర్యావరణ సుస్థిరత కోసం ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల కొనుగోలుపై రాయితీలు కల్పిస్తున్నాయి.

EV Scooters Under 1.5 Lakhs: పెరుగుతున్న ఈవీ స్కూటర్ల వినియోగం… రూ.1.5 లక్షల లోపు ఉన్న బెటర్‌ స్కూటర్లు ఇవే
Ev Scooters
Follow us
Srinu

|

Updated on: Jul 22, 2023 | 4:15 PM

భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల జోరు కొనసాగుతుంది. పెరుగుతున్న పెట్రోల్‌ ధరలకు ప్రత్యామ్నాయంగా అందరూ ఈవీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. మొదట్లో పట్టణ ప్రాంత ప్రజలే ఎక్కువగా ఈవీ వాహనాలను కొన్నప్పటికీ క్రమేపి గ్రామీణ ప్రాంతాల వారు కూడా ఈవీ వాహనాల కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. వాహన నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతుండడం, పర్యావరణ సుస్థిరత కోసం ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల కొనుగోలుపై రాయితీలు కల్పిస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో రూ.1.5 లక్షల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ ఈవీ స్కూటర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

టీవీఎస్‌ ఐక్యూబ్‌

టీవీఎస్‌ ఐక్యూబ్‌ 3.04 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలో మీటర్ల మైలేజ్‌ ఇస్తుంది. ఈ స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు 78 కిలో మీటర్లుగా ఉంది. 7 అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బ్లూటూత్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లతో కూడిన ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, 32 లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ వంటి ఎన్నో ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. ఈ స్కూటర్ 11 కూల్ ఆప్షన్‌లలో లభిస్తుంది. పెర్ల్ వైట్, టైటానియం గ్రే గ్లోసీ, మెర్క్యురీ గ్రే గ్లోసీ, కాపర్ బ్రాంజ్ మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లోసీ, మింట్ బ్లూ, షైనింగ్ రెడ్, లూసిడ్ ఎల్లో, టైటానియం గ్రే మ్యాట్, కాపర్ బ్రాంజ్ గ్లోసీ, కోరల్ సాండ్ గ్లోసీ కలర్స్‌లో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంటుంది.

ఓలా ఎస్‌ 1

ఓలా భారతీయ మార్కెట్లో ఎస్‌1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1.10 లక్షల (ఎక్స్-షోరూమ్, ఫేమ్‌-2 సబ్సిడీతో సహా) ధరకు అందిస్తోంది. ఈ స్కూటర్‌లో 3 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ అమర్చి ఉన్నారు. ఇది ఒక ఛార్జ్‌పై ఐడీసీ -సర్టిఫైడ్ 125 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. 4.5 కేడబ్ల్యూ మోటార్‌తో 85 కేఎంపీహెచ్‌ గరిష్ట వేగాన్నిసాధించడంలో సహాయపడుతుంది. ఈ-స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 34-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

ఇవోమీ ఎస్‌1

ఈ స్కూటర్‌ రూ. 84,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో లభిస్తుంది. ఈ స్కూటర్‌ 35 ఏహెచ్‌ స్వాప్ చేసే బ్యాటరీని ఉపయోగిస్తుంది. ఇది 110 కిలో మీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఇది మూడు వేరియంట్‌లను పొందుతుంది. ఎస్‌1 80, ఎస్‌1 200, ఎస్‌1 240 మోడల్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇవోమి ఎస్‌1 గరిష్ట వేగం 55 కిలోమీటర్లు. ఎలక్ట్రిక్ స్కూటర్ ఆరు రంగుల ఎంపికల్లో ఉంటుంది. ట్రూ రెడ్, స్కార్లెట్ రెడ్, పెరల్ వైట్, మూన్ గ్రే, మిడ్‌నైట్ బ్లూ, పీకాక్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఒకినోవా ప్రైస్‌ ప్రో

ఈ స్కూటర్‌ 2.08 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్‌ను ఓ సారి ఛార్జ్‌ చేస్తే 81 కిలో మీటర్ల మైలేజ్‌ వస్తుంది. 56 కిలో మీటర్ల గరిష్ట వేగాన్ని అందించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, యాంటీ థెఫ్ట్ అలారంతో సెంట్రల్ లాకింగ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ సిస్టమ్ వంటి ఫీచర్లతో వస్తుంది. రూ.99,645 (ఎక్స్-షోరూమ్) ధరతో ఒకినావా ప్రైజ్ ప్రో గ్లోసీ స్పార్కిల్ బ్లాక్, గ్లోసీ రెడ్ బ్లాక్, గ్లోసీ బ్లూ బ్లాక్ వంటి మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. 

హీరో ఎలక్ట్రిక్‌ ఆప్టిమా

హీరో ఎలక్ట్రిక్‌ ఆప్టిమా 30 ఏహెచ్‌ డ్యూయల్ బ్యాటరీతో అందిస్తున్నారు. ఈ స్కూటర్‌ ఓ సారి ఛార్జ్ చేస్తే 140 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. అలాగే గంటకు 45 కిలో మీటర్ల గరిష్ట వేగం ఈ స్కూటర్‌ సొంతం. ఈ స్కూటర్‌ ధర రూ. 85,190(ఎక్స్-షోరూమ్, ఆంధ్రప్రదేశ్) నుంచి ఉంటుంది. ఈ స్కూటర్‌ గ్రే, బ్లూ, వైట్‌ మూడు రంగుల ఎంపికల్లో లభిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్