Education Loan: స్కూల్ ఫీజులు కట్టేందుకు కూడా లోన్ సదుపాయం.. లోన్ ఇస్తున్న బ్యాంకు ఏంటో తెలుసా?
అయితే ఒకేసారి లక్షల్లో ఫీజులు చెల్లించాలంటే ఎంత కోటీశ్వరుడికైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే మధ్యతరగతి ప్రజల కష్టాలైతే వర్ణానాతీతం. ప్రస్తుత రోజుల్లో అందరూ వేతన జీవులు కాబట్టి నెలవారీ సులభ వాయిదా పద్ధతిలో చెల్లించడానికి ఇష్టపడుతుంటారు.

విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఇళ్లల్లో ఫీజుల రగడ మొదలైంది. ఎల్‌కేజీ పిల్లలకే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పిల్లల భవిష్యత్ కోసం పెట్టుబడికి వెనుకాడని తల్లిదండ్రలూ ఉన్నారు. అయితే ఒకేసారి లక్షల్లో ఫీజులు చెల్లించాలంటే ఎంత కోటీశ్వరుడికైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే మధ్యతరగతి ప్రజల కష్టాలైతే వర్ణానాతీతం. ప్రస్తుత రోజుల్లో అందరూ వేతన జీవులు కాబట్టి నెలవారీ సులభ వాయిదా పద్ధతిలో చెల్లించడానికి ఇష్టపడుతుంటారు. అయితే పాఠశాలల్లో టెర్మ్ ఫీజు ఉంటుందని మంత్లీ ఫీజు చెల్లించే పద్ధతి ఉండదు. అయితే ఇలాంటి వారికి శుభవార్త చెబుతూ ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే ఎడ్యుకేషన్ లోన్ అనేది సాధారణంగా ఉన్నత విద్యకే ఇస్తారని అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పాఠశాల విద్యకు కూడా ఫీజు ఫైనాన్స్ సేవలను తీసుకువచ్చింది. ఆ వివరాలను తెలుసుకుందాం.
ఐడీఎఫ్‌సీ స్కూల్ ఫీజు ఫైనాన్స్ పథకం కింద ఏకంగా రూ. 9 లక్షల వరకు రుణం పొందవచ్చని బ్యాంక్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అంతేకాదు డిజిటల్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా లోన్ పొందవచ్చు. అలాగే ఈ లోన్ సులభమైన రీపేమెంట్ ఆప్షన్ ఉంది. తక్కువ ఖర్చుతో ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. పదవీకాలం రెండు సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే లోన్ పొందడానికి కచ్చితంగా పాఠశాలలో ప్రవేశం పొంది ఉండాలి. పాఠశాల పిల్లల తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకులు ఈ రుణం పొందడానికి అర్హులు. అప్లికేషన్ ఫోటో ఐడీ, దరఖాస్తుదారు నివాస రుజువు, ప్రవేశ పత్రాలు, ఫీజు నిర్మాణ పత్రం, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి పత్రాలు అవసరం. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల చదువుల కోసం కూడా రుణం తీసుకోవచ్చు.
అయితే ఈ ఫైనాన్స్ ఎంపిక బ్యాంకు భాగస్వామ్యం ఉన్న పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి మీరు లోన్ కోసం అప్లై చేసే ముందు దీన్ని చెక్ చేసుకోవాలి. మీరు మీ సమీపంలోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించి ఈ లోన్ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అర్హులైన వ్యక్తులు సులభంగా రుణం పొందవచ్చు. మరోవైపు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సులభమైన విద్యా రుణాలు కూడా అందిస్తారు. ఈ బ్యాంకులు మీరు రూ. 50 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. విదేశీ విద్య కోసం కూడా రుణాలు పొందవచ్చు.



మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం