Income Tax: విదేశాలకు వెళ్లే వ్యక్తులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ కావాలా?

భారతీయులు విదేశాలకు వెళ్లే ముందు ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడం గురించి వస్తున్న వార్తల గురించి సీబీడీటీ వివరణ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లే ముందు పౌరులందరూ ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆదాయపు పన్ను శాఖ తన ప్రకటనలో పేర్కొంది. CBDT వివరాల ప్రకారం ప్రచారం జరుగుతున్న..

Income Tax: విదేశాలకు వెళ్లే వ్యక్తులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి ట్యాక్స్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్‌ కావాలా?
Income Tax
Follow us
Subhash Goud

|

Updated on: Aug 22, 2024 | 4:54 PM

భారతీయులు విదేశాలకు వెళ్లే ముందు ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడం గురించి వస్తున్న వార్తల గురించి సీబీడీటీ వివరణ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లే ముందు పౌరులందరూ ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆదాయపు పన్ను శాఖ తన ప్రకటనలో పేర్కొంది. CBDT వివరాల ప్రకారం ప్రచారం జరుగుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.

ఈ నిబంధనలు పౌరులందరికీ వర్తించవు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఏ సందర్భాలలో ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరం అనే దాని గురించి వివరణాత్మక సమాచారాన్ని అందించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 230 ప్రకారం.. విదేశాలకు వెళ్లే ముందు పౌరులందరూ పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం లేదని తెలిపింది. కొంతమంది వ్యక్తులు ప్రత్యేక పరిస్థితుల్లో పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందడం అవసరం. 2003 నుంచి ఈ నిబంధన అమల్లో ఉందని, ఫైనాన్స్ (నం. 2) చట్టం 2024లో సవరణలు చేసినప్పటికీ ఈ విధానంలో ఎలాంటి మార్పు రాలేదని CBDT తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఆర్థిక మోసాలకు పాల్పడే వ్యక్తులకు వర్తించే నియమాలు

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 230(1A) ప్రకారం.. భారతదేశంలో నివసించే పౌరులు దేశం విడిచి వెళ్లడానికి ముందు ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ అవసరమని ఫిబ్రవరి 5, 2024 లోనే సీబీడీటీ స్పష్టం చేసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడితే, ఆదాయపు పన్ను చట్టం లేదా సంపద పన్ను చట్టం కింద ఆ వ్యక్తి ఈ కేసుల దర్యాప్తు కోసం దేశంలో ఉండటం అవసరం. అలాగే ఆ వ్యక్తిపై పన్ను డిమాండ్ జారీ చేయవచ్చు. అప్పుడు అటువంటి వ్యక్తి దేశం విడిచి వెళ్ళే ముందు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది.

10 లక్షల కంటే ఎక్కువ పన్ను బకాయి ఉంటే..

అలాగే ఒక వ్యక్తి రూ. 10 లక్షల కంటే ఎక్కువ ప్రత్యక్ష పన్ను బకాయిలు కలిగి ఉండి, దానిపై ఎటువంటి అధికారాలు స్టే విధించనట్లయితే, అలాంటి వ్యక్తి దేశం విడిచి వెళ్లే ముందు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా పొందవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్‌కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక మోసాలకు పాల్పడి, రూ. 10 లక్షల కంటే ఎక్కువ పన్ను డిమాండ్ ఉన్న ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భారతీయ పౌరులు దేశం విడిచి వెళ్లే ముందు ఆదాయపు పన్ను క్లియరెన్స్ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుందని సీబీడీటీ తన వివరణలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Bank Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్