- Telugu News Photo Gallery Business photos Amazon offers discounts on washing machines, check details in telugu
Amazon Sale 2024: మార్కెట్లో ఉత్తమ వాషింగ్ మెషీన్లు ఇవే.. 50శాతం డిస్కౌంట్.. త్వరపడండి..
తీసుకుంటే టాప్ బ్రాండ్ వాషింగ్ మెషీనే తీసుకోవాలని అనుకుంటున్నారా? వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆలోచించి కొనకుండా ఆగిపోతున్నారా? అయితే ఇక మీరు ఆగాల్సిన పనిలేదు. టాప్ బ్రాండ్ల నుంచి వచ్చే వాషింగ్ మెషీన్లపై అదిరే ఆఫర్లను ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ సేల్ 2024లో 50శాతం వరకూ డిస్కౌంట్లను టాప్ బ్రాండ్ వాషింగ్ మెషీన్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం అమెజాన్ ఆఫర్లో అందుబాటులో ఉన్న బెస్ట్ వాషింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 22, 2024 | 4:56 PM

వోల్టాస్ బెకో 7కే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్.. ఇది అధిక నాణ్యత కలిగిన వాషింగ్ మెషీన్. అమెజాన్లో దీనిపై ఏకంగా 50శాతం డిస్కౌంట్ మీరు పొందుతారు. ఈ ఏడు కిలోల వాషింగ్ మెషీన్ ఒక చిన్న కుటుంబానికి సరిపోతుంది. దీని ధర ప్రస్తుతం ఆఫర్ లేకుండా రూ. 27,990గ ఉంది. అదే సమయంలో 50శాతం అమెజాన్ ఆఫర్ తో అయితే రూ, 13,890గా ఉంది. యాక్సెస్, వన్ కార్డ్, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ నుంచి కొనుగోలు చేస్తే రూ. 250 వరకు తక్షణ తగ్గింపును పొందుతారు.

హయర్ 8కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్.. దీనిలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్లో ఇది 40శాతం తగ్గింపుతో వస్తుంది. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 2,000 ఆదా అవుతుంది. దీనిలో 15 వాషింగ్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర రూ. 32,190గా ఉంది.

శామ్సంగ్ 9కేజీ బెస్ట్ వాషింగ్ మెషీన్.. ఈ టాప్ బ్రాండ్ వాషింగ్ మెషీన్ పై 27శాతం తగ్గింపు లభిస్తోంది. రూ. 54, 990గా ఉండే దీనిని మీరు రూ. 39,990కి కొనుగోలు చేయొచ్చు. ఇది కాక యాక్సెస్, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులపై రూ. 2,000 వరకు తగ్గింపును పొందుతారు.

వర్ల్ పూల్ 7కేజీ ఇన్వర్టర్ ఆటోమేటిక్ వాషర్ మెషీన్.. ఇది కాస్త పెద్ద కుటుంబాలకు కూడా సరిపోతుంది. దీనిపై 23శాతం తగ్గింపును అందిస్తుంది. రూ. 35,250 విలువైన ఈ వాషింగ్ మెషీన్ ను కేవలం రూ. 26,990కి కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్ కింద మరో రూ. 2000 కూడా తగ్గింపు లభిస్తుంది. ఇది అత్యాధునిక సాంకేతికతతో వస్తుంది. ఆవిరి కూడా వస్తుంది. ఇదే ఆరబెట్టేస్తుంది.

ప్యానసోనిక్ 8కేజీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్.. పెద్ద కుటుంబాలకు సరిగ్గా సరిపోయే ఈ వాషింగ్ మెషీన్ పై అమెజాన్లో మీకు 20శాతం తగ్గింపు లభిస్తుంది. క్రెడిట్ కార్డుపై మరో రూ. 750 తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీనిలో ఆవిరి యంత్రం, డైనమిక్ స్పిన్ ఫీచర్లతో వస్తుంది. స్టీమ్ టెక్నాలీ బట్లపై మొండి మరకలను తగ్గిస్తుంది. చైల్డ్ లాక్ సదుపాయం ఉంటుంది. దీని ధర రూ. 32,990గా ఉంది.




