AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2023: బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయా..? సామాన్యులకు ఊరట కలుగనుందా?

ఈనెల చివరి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నాయి. అయితే ముఖ్యంగా..

Budget 2023: బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపులు ఉంటాయా..? సామాన్యులకు ఊరట కలుగనుందా?
Income Tax
Subhash Goud
|

Updated on: Feb 01, 2023 | 10:47 AM

Share

ఈనెల చివరి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నాయి. అయితే ముఖ్యంగా పన్ను విషయంలో చర్చ జరుగుతోంది. కేంద్ర బడ్జెట్‌ను సమర్పించినప్పుడల్లా ఆదాయపు పన్ను స్లాబ్ గురించి చర్చ జరుగుతుంది. ఆదాయపు పన్ను అంటే మన ఆదాయంపై విధించే పన్ను. కానీ ఆదాయపు పన్ను స్లాబ్ అర్థం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పన్ను స్లాబ్ గురించి తెలుసుకుందాం. ఆదాయాన్ని పన్ను శ్లాబులుగా విభజించారు. వివిధ ఆదాయాల స్లాబ్ తయారు చేయబడింది. దాని ఆధారంగా ప్రజలు పన్ను చెల్లిస్తారు. ముఖ్యంగా ఆదాయ పన్ను పరిధిలో ఉండే వేతన ఉద్యోగులు ఈ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. పన్ను మినహాయింపులు కల్పించిన తమపై భారం తగ్గిస్తారని వారు ఆశిస్తున్నారు.

మధ్యతరగతి వేతన ఉద్యోగులతో పాటు అధిక ఆదాయ గ్రూపుల పరిధిలోకి వచ్చేవారూ పన్ను శ్లాబులలో మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. సుమారు 136 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో దాదాపు 8 కోట్ల మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. అదేసమయంలో జీఎస్టీ, కొన్ని రకాల సర్‌చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి పరోక్ష పన్నులను వసూలు చేస్తుంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరు ఈ పరోక్ష పన్నులే.

ప్రస్తుతం కొత్త పన్ను శ్లాబ్, పాత పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. ఇది మీరు ఎన్ని లక్షల ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలియజేస్తుంది. దీనితో పాటు ఏ వయస్సు వ్యక్తులు వారి ఆదాయంపై పన్ను చెల్లించాలి? ఎంత మొత్తంలో పన్ను రహితం అని కూడా పన్ను స్లాబ్‌లో ఉంటుంది. ఆదాయపు పన్ను మొత్తం నేరుగా ప్రభుత్వ ఖాతాకే చేరుతుంది. పరిశ్రమలు, కంపెనీలు చెల్లించే పన్నుకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేస్తారు.

ఇవి కూడా చదవండి

వివిధ ఆదాయ సంపాదకులు వేర్వేరు పన్నులు చెల్లించాలి:

పన్ను స్లాబ్‌ల ద్వారా ఆదాయం నిర్ణయిస్తారు. దాని ఆధారంగా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను శ్లాబ్ మారుతున్న కొద్దీ దానిపై విధించే పన్ను కూడా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల పన్ను వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి కొత్త పన్ను శ్లాబ్ కాగా, మరొకటి పాత పన్ను శ్లాబ్. గత బడ్జెట్‌లలో ప్రభుత్వం పాత పన్ను శ్లాబులను రద్దు చేయలేదు. ప్రభుత్వం రెండింటికి ఆప్షన్‌ ఇచ్చింది. మీరు ఏ పన్ను స్లాబ్‌తో పన్ను చెల్లించాలో నిర్ణయించుకోవాలి.

కొత్త, పాత పన్ను స్లాబ్‌లు ఏమిటి?

పాత పన్ను శ్లాబ్ ప్రకారం.. మీ ఆదాయం రూ. 2.5 లక్షల వరకు ఉంటే, మీరు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం ఉంటే 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కూడా ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను మినహాయింపు పొందితే.. కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం.. మీ ఆదాయం 5 నుండి 7.50 లక్షల వరకు ఉంటే మీరు మొత్తం 10 శాతం పన్ను చెల్లించాలి. ఇది కాకుండా 60 నుండి 80 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు రూ.3 లక్షలు, 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుంది.

మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు