Gold: బంగారంపై వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ షాకింగ్‌ నివేదిక.. భారత్‌లో తగ్గిన బంగారం డిమాండ్‌

భారతీయులు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు..

Gold: బంగారంపై వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ షాకింగ్‌ నివేదిక.. భారత్‌లో తగ్గిన బంగారం డిమాండ్‌
Gold
Follow us

|

Updated on: Jan 31, 2023 | 6:47 PM

భారతీయులు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్‌లో అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారం షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. అయితే 2022 సంవత్సరంలో బంగారం డిమాండ్ కొంత తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2022లో భారత్‌లో బంగారం డిమాండ్‌ 2.92 శాతం తగ్గిందని, దీంతో దిగుమతులు 774 టన్నులకు తగ్గాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక వెల్లడించింది. డబ్ల్యూజీసీ నివేదిక ప్రకారం.. 2021 సంవత్సరంలో మొత్తం బంగారం దిగుమతి 797.3 టన్నులు.

2022 చివరి త్రైమాసికం ప్రారంభంలో పండుగల కారణంగా పెట్టుబడి డిమాండ్ పెరిగిందన్నారు. అయితే పెళ్లిళ్ల సీజన్‌లో బంగారు ఆభరణాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారు.

ఆభరణాలకు డిమాండ్ తగ్గుదల:

నాల్గవ త్రైమాసికంలో, మొత్తం 2022 సంవత్సరంలో భారతదేశంలో బంగారం డిమాండ్ వరుసగా 345 టన్నులు, 797.3 టన్నులు తగ్గింది. దేశంలో ఆభరణాల మొత్తం డిమాండ్ 2021లో 610.9 టన్నుల నుంచి 2022లో 600.4 టన్నులకు రెండు శాతం తగ్గింది. విలువ పరంగా గత ఏడాది రూ.2,61,150 కోట్ల నుంచి నాలుగు శాతం పెరిగి రూ.2,72,810 కోట్లకు చేరుకుంది. సంవత్సరంలో మొత్తం పెట్టుబడి డిమాండ్ ఏడు శాతం తగ్గి 173.6 టన్నులకు చేరుకుంది. ఇది 2021లో 186.5 టన్నులు. విలువ పరంగా బంగారం పెట్టుబడి డిమాండ్ 2021లో రూ.79,720 కోట్ల నుంచి రూ.78,860 కోట్లకు ఒక శాతం తగ్గింది. భారతదేశంలో బంగారం రీసైక్లింగ్ 2022 నాటికి 30 శాతం పెరిగి 97.6 టన్నులకు చేరుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

దేశీయంగా అధిక ధరలు ఉన్నప్పటికీ, బంగారానికి డిమాండ్ 600 టన్నులు ఉందని, ఇది 2021 కంటే కేవలం రెండు శాతం తక్కువగా ఉందని WGC, ఇండియన్ రీజియన్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పిఆర్ చెప్పారు. నాల్గవ త్రైమాసికంలో, దేశంలో బంగారం డిమాండ్ 2021 అదే త్రైమాసికంలో 343.9 టన్నుల నుండి 2022 నాటికి 276.1 టన్నులకు 22 శాతం తగ్గింది. విలువ పరంగా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.1,48,780 కోట్ల నుంచి 15 శాతం తగ్గి రూ.1,25,910 కోట్లకు చేరింది. 2022లో భారతదేశం మొత్తం 673.3 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, 2021లో 924.6 టన్నుల కంటే 27 శాతం తక్కువ అని ఆయన చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో