Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Tax Rule: జీవిత బీమా పాలసీపై కొత్త ఆదాయపు పన్ను నియమం

సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం మొత్తం, ఏప్రిల్ 1 2023 నుండి జారీ చేయబడిన జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ తర్వాత దాని ఆదాయంపై పన్ను విధించనున్నారు. రూ. 5 లక్షల కంటే తక్కువ వార్షిక ప్రీమియం ఉన్న పాలసీలకు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎక్కువ ప్రీమియం ఉన్న పాలసీల మెచ్యూరిటీ మొత్తం వ్యక్తి ఆదాయానికి వ్యతిరేకంగా పరిగణించడం జరుగుతుంది..

New Tax Rule: జీవిత బీమా పాలసీపై కొత్త ఆదాయపు పన్ను నియమం
Life Insurance Policies
Follow us
Subhash Goud

|

Updated on: Aug 21, 2023 | 3:47 PM

పన్నును ఆదా చేసేందుకు బీమా పాలసీల ముసుగులో పెట్టుబడి పథకాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త నిబంధనను రూపొందించింది. అధిక ప్రీమియంలతో కూడిన జీవిత బీమా పాలసీల ద్వారా వచ్చే ఆదాయాన్ని పన్ను పరిధిలోకి చేర్చాలని నిర్ణయించారు. 5 లక్షల రూపాయల కంటే అధిక వార్షిక ప్రీమియంతో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల ద్వారా వచ్చే ఇన్‌కమ్‌పై పన్ను విధించనున్నట్లు ఈ కొత్త రూల్స్‌ ద్వారా తెలుస్తోంది. సీబీడీటీ ఇటీవల ఆదాయపు పన్ను నిబంధనల చట్టం కింద కొత్త రూల్ 11UACAని జోడించింది.

బీమా పాలసీ కొత్త రూల్ వివరణ:

సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం మొత్తం, ఏప్రిల్ 1 2023 నుండి జారీ చేయబడిన జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ తర్వాత దాని ఆదాయంపై పన్ను విధించనున్నారు. రూ. 5 లక్షల కంటే తక్కువ వార్షిక ప్రీమియం ఉన్న పాలసీలకు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఎక్కువ ప్రీమియం ఉన్న పాలసీల మెచ్యూరిటీ మొత్తం వ్యక్తి ఆదాయానికి వ్యతిరేకంగా పరిగణించడం జరుగుతుంది. అయితే వ్యక్తి ఆదాయ వివరాలను బట్టి బట్టి పన్ను వర్తిస్తుంది. యూనిట్ లింక్డ్ బీమా పాలసీలకు ఈ కొత్త నిబంధన వర్తించదు.

ఇన్సూరెన్స్ పాలసీ కొత్త రూల్స్ ఎందుకు?

ప్రభుత్వం విధించే ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి బీమా పాలసీ, పీపీఎఫ్ మొదలైనవి. కొన్ని కంపెనీలు బీమా పాలసీల ముసుగులో పెట్టుబడులు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ఇవి బీమా పేరుతో పెట్టుబడి పథకాలు. ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అయితే చెల్లించాల్సిన ఆదాయపు పన్ను బీమా ప్లాన్‌గా లేబుల్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

ఈ రకమైన దుర్వినియోగాన్ని నిరోధించడానికి సీబీడీటీ ఇప్పుడు పన్ను నిబంధనలను మార్చింది. మీరు ఒక సంవత్సరంలో చెల్లించే ప్రీమియంలు 5 లక్షలు దాటితే బీమా పాలసీ ఆదాయంపై పన్ను విధించనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి