Fraud Calls: ఇలాంటి ఒక్క కాల్ చాలు మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ కావడానికి..
అఖిల్ కి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన వెంటనే అటు నుంచి అబ్బాయ్ ఎలా ఉన్నావు? నేను LIC ఏజెంట్ శర్మ అంకుల్ మాట్లాడుతున్నాను అని చెప్పారు. అఖిల్ కొద్దిగా మొహమాటంగా ఆ.. అంకుల్.. నేను బావున్నాను అని చెప్పాడు. అయితే, నిజానికి అఖిల్ కి శర్మ ఎవరో గుర్తు లేదు. కానీ.. అవతల నుంచి ఆయన మాట్లాడిన విధానంతో ఈ అంకుల్ తనకు తెలిసినవారే అని నమ్మాడు. తరువాత శర్మ అనే ఆయన మీ నాన్నగారు మీ..
సాధారణంగా మనం మొబైల్ కి వచ్చే ప్రతి కాల్ అటెండ్ అవుతాం. అవి తెలియని నెంబర్ అయినా సరే తప్పనిసరిగా లిఫ్ట్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే అది మనవారికి సంబంధించిన ఏదైనా అత్యవసరమైన కాల్ కావచ్చు అనే ఉద్దేశ్యంతో. ఇలా మీరు కూడా చేస్తున్నట్లయితే.. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అఖిల్ విషయంలో జరిగినట్టు మీకు జరగకూడదు. అసలు అఖిల్ కి ఏమి జరిగింది చూద్దాం..
అఖిల్ కి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసిన వెంటనే అటు నుంచి అబ్బాయ్ ఎలా ఉన్నావు? నేను LIC ఏజెంట్ శర్మ అంకుల్ మాట్లాడుతున్నాను అని చెప్పారు. అఖిల్ కొద్దిగా మొహమాటంగా ఆ.. అంకుల్.. నేను బావున్నాను అని చెప్పాడు. అయితే, నిజానికి అఖిల్ కి శర్మ ఎవరో గుర్తు లేదు. కానీ.. అవతల నుంచి ఆయన మాట్లాడిన విధానంతో ఈ అంకుల్ తనకు తెలిసినవారే అని నమ్మాడు. తరువాత శర్మ అనే ఆయన మీ నాన్నగారు మీ పేరు మీద తీసుకున్న పాలసీ మెచ్యూర్ అయింది. 6 లక్షలు ఇస్తారు. కానీ మీ నాన్నగారు చివరి ప్రీమియం కట్టడం మర్చిపోయారు. అని అఖిల్ కి చెప్పాడు. అవునా అంకుల్.. ఇప్పుడు ఏమి చేయాలి? అని అడిగాడు అఖిల్. మెచ్యూరిటీ ఎమౌంట్ క్లెయిం చేయడం కోసం మిగిలిన 16 వేల రూపాయల ప్రీమియం వెంటనే కట్టండి అని చెప్పాడు. ఈ నెంబర్ కు గూగుల్ పే ఉంది. అందులో పంపించండి. లేదా మీకు పేమెంట్ లింక్ పంపిస్తాను. దాని ద్వారా డబ్బు పంపండి. మీరు ఆలస్యం చేయకండి. ఆలస్యం అయితే, మెచ్యూరిటీ ఎమౌంట్ క్లెయిమ్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పాడు.
ఆ మాటలు విన్న అఖిల్ సరే అంకుల్ పంపిస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తరువాత పేమెంట్ చేద్దామని ఫోన్ తీసుకున్నప్పుడు అతనికి చిన్న అనుమానం వచ్చింది. LIC అంటే ప్రీమియం LIC పోర్టల్ లో కట్టాలి కదా? శర్మకు ఎందుకు పంపాలి అని డౌట్ వచ్చింది. వెంటనే ఆగి.. తన తండ్రితో మాట్లాడాడు. అయన తానూ అటువంటి పాలసీ ఏదీ తీసుకోలేదని స్పష్టం చేశాడు. దీంతో అఖిల్ డబ్బు కోల్పోకుండా సేవ్ అయ్యాడు. మీరు కూడా ఇటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు లేదా మీ కుటుంబం ఎప్పుడైనా అలాంటి పాలసీని తీసుకున్నారో లేదో తనిఖీ చేయడం మాత్రమే చెల్లించే ముందు అటువంటి కాల్‌లను ఎదుర్కోవడానికి ఏకైక మార్గం. మోసపూరిత కాల్స్ మీకు ఎప్పుడూ పక్కనే ఉంటాయి. ఇలా LIC పేరుతొ మాత్రమె కాదు.. ఉద్యోగాల పేరుతో కూడా ఈ తరహా మోసం జరుగుతోంది.
కొందరు ఇలా వర్క్ ఫ్రం హోమ్ పేరుతొ వచ్చిన ఫ్రాడ్ కాల్ కి చిక్కుకుంటున్నారు. చాలా మందికి వాట్సప్ మెసేజ్‌తో ప్రారంభం అయింది. అతనికి ఒక మెసేజ్ వచ్చింది. నేను ఒక MNC HR పూజా భాటియా తరపున మెసేజ్ పంపుతున్నాను… మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండి .. రోజుకు కొన్ని గంటలు ఖాళీగా సమయం మీకుంటే.. మాతో చేరండి .. ఇంటి నుంచి సంపాదించండి అనేది ఆ మెసేజ్ పాఠం. ఈ మెసేజ్ కోసం స్పందించి మీరు కాల్ చేశారు అంటే మీరు ఆ మోసగాళ్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వలలో చిక్కుకున్నారని అర్ధం.
అటువంటి కాల్‌లలో వినియోగదారు సర్వే సాధారణ ప్రశ్నలకు సమాధానమివ్వడం లేదా YouTube వీడియోలను లైక్ చేయడం వంటి కొన్ని సాధారణ పనులు ఇస్తారు. 500-1000 రూపాయలు టోకెన్ మొత్తంగా మీకు ట్రాన్స్ ఫర్ చేస్తారు. అప్పుడు మీరు మెంబర్‌షిప్ తీసుకోవడం ద్వారా అకౌంట్ ఓపెన్ చేయడానికి వేసే ఎరకు సరిగ్గా చిక్కుకుంటారు. ప్రస్తుతం మీరు రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నారని.. మీరు సభ్యత్వం పొందితే, మీరు 15-20 వేలు సంపాదిస్తారనే భరోసాతో ఎర వేస్తారు. దీని కోసం 5-10 వేల రూపాయల మెంబర్షిప్ ఫీజు వసూలు చేస్తారు. మీ డబ్బు జమ అయినట్టు నకిలీ మెంబర్ షిప్ అకౌంట్‌లో కనిపిస్తుంది. కానీ.. ఎప్పటికీ తిరిగి పొందలేరు. మీ డబ్బు జమ చేసిన కంపెనీ రాత్రికి రాత్రి మూటా.. ముల్లె సర్దేస్తుంది.
మీరు జాగ్రత్తగా ఉండవలసిన మరో కాల్ కేవైసీ కాల్. ఇందులో కేవైసీ ప్రక్రియ అంటే నో యువర్ కస్టమర్ పూర్తి చేయడానికి డీటెయిల్స్ ఇవ్వాలి అంటూ బ్యాంక్ లేదా ఇ-వాలెట్ వంటి ఆర్థిక సంస్థల పేరును ఉపయోగించి కాల్‌లు చేస్తారు. ఇది చాలా అత్యవసరం అనీ లేకపోతె మీ అకౌంట్ నిలిచి పోతుందనీ భయపెట్టడతారు. మీ గుర్తింపు వెరిఫై కాకపొతే 24 గంటల తరువాత ఎలాంటి చెల్లింపు చేయలేరు. మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుంది అని చెబుతారు. దీన్ని నివారించడానికి మీకు లింక్‌ను పంపుతారు. దాన్ని క్లిక్ చేసి కేవైసీని అప్‌డేట్ చేయమని అడుగుతారు.
ఈ లింక్ నకిలీ యాప్ లేదా సైట్‌కి సంబంధించినది. దీన్ని తెరవడానికి ఓటీపీ అడుగుతారు. దుండగుల వద్ద ఇప్పటికే మీ కార్డ్ లేదా బ్యాంక్ వివరాలు ఉంటాయి. ఓటీపీ ఏ వెబ్‌సైట్‌కి సంబంధించినది కాదు కానీ మీ బ్యాంక్ ఖాతా నుంచి జరుగుతున్న లావాదేవీకి సంబంధించినది. మీరు దీన్ని షేర్ చేస్తారు. దీంతో మీ డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇటువంటి కాల్స్‌పై మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తీవ్రంగా మోసపోతారు. ఈ మోసపూరిత కాల్‌ల పట్ల జాగ్రత్త వహించండి .. ఒకవేళ అనుకోకుండా మీరు అలాంటి మోసానికి బలైపోతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ – cybercrime.gov.in లేదా టోల్-ఫ్రీ నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930లో ఫిర్యాదు చేయండి. సైబర్ దుండగులు పగలు, రాత్రి దోచుకోవడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు .. వాటిని నివారించడానికి ఏకైక మార్గం మనం కూడా పగలు .. రాత్రి అప్రమత్తంగా ఉండటం ఒక్కటే.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి