Maruti Suzuki Celerio: ఆకట్టుకుంటున్న సెలెరియో నయా ఎడిషన్.. టాప్ రేపుతున్న ఫీచర్లు
భారతదేశంలో మారుతీ సుజుకీ కార్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా బడ్జెట్ కార్లకు మారుతీ ప్రసిద్ధి చెందింది. కొన్ని ప్రత్యేక మోడల్స్ మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకోవడంతో సేల్స్‌పరంగా మారుతి సుజుకి సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ భారతదేశంలో ప్రారంభించారు. ఈ కారు ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్- షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద రూ.11 వేల విలువైన ఉచిత ఉపకరణాలతో అందిస్తుంది. ఈ నేపథ్యంలో సెలెరియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

మారుతి సుజుకి సెలెరియోకు సంబంధించిన కొత్త లిమిటెడ్ ఎడిషన్ సెలెరియో లుక్‌ను మెరుగుపరిచే విధంగా రూపొందించారు. వీటి విలువ దాదాపు రూ.11 వేలు ఉంటుంది. సెలెరియో నయా ఎడిషన్ ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించిన డ్రీమ్ సిరీస్ పై ఆధారంగా రూపొందించారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎడిషన్లో బాడీ కిట్, క్రోమ్-యాక్సెంటెడ్ సైడ్ మోల్డింగ్లు, నలుపు రంగులో ఉన్న స్పోర్టీ రూఫ్ స్పాయిలర్ ఉన్నాయి. లోపలి భాగంలో హ్యాచ్బ్యాక్ క్యాబిన్ సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు ట్విన్-కలర్ డోర్ సిల్ గార్డ్లు, ప్రీమియం ఫ్లోర్ మ్యాట్లతో అప్గ్రేడ్ చేశారు. సెలెరియో లిమిటెడ్ ఎడిషన్ అదే విశ్వసనీయమైన 1.0-లీటర్ కే-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో 66 బీహెచ్‌పీ, 89 ఎన్ఎం గరిష్ట టార్క్ ను అందిస్తుంది.
మారుతీ సుజుకీ సెలెరియో 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్‌తో సహా రెండు గేర్బాక్స్ ఎంపికలలో వస్తుంది. మరోవైపు సీఎన్‌జీ వేరియంట్ 56 బీహెచ్‌పీ, 82.1 ఎన్ఎం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. అలాగే ఈ వెర్షన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్‌తో వస్తుంది. సెలెరియో దాని సెగ్మెంట్లో అత్యంత ఇంధన-సమర్థవంతమైన కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. పెట్రోల్ మాన్యువల్ అయితే లీటర్‌కు 24.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే, ఆటోమెటిక్ మాత్రం 25.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 32.85 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది.
లిమిటెడ్ ఎడిషన్ తక్కువ వేరియంట్స్‌లోనే అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ సెలెరియో లైనప్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. అలాగే ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‌పీ, హిల్ హెూల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటాయి. అలాగే ఈ కారు ధర రూ. 4.99 లక్ష లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అయితే ఈ ఆఫర్ పొందడానికి ఈ రోజే ఆఖరు అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








