Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బ్యాంకులో FD చేస్తే SBI కన్నా ఎక్కువ వడ్డీ పొందే ఛాన్స్.. సీనియర్ సిటిజన్లకు గోల్డెన్ ఛాన్స్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను పెంచిన తర్వాత, దేశంలోని ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆకర్షణీయంగా మార్చడానికి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

ఈ బ్యాంకులో FD చేస్తే SBI కన్నా ఎక్కువ వడ్డీ పొందే ఛాన్స్.. సీనియర్ సిటిజన్లకు గోల్డెన్ ఛాన్స్
Business Idea
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 21, 2023 | 4:29 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్లను పెంచిన తర్వాత, దేశంలోని ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆకర్షణీయంగా మార్చడానికి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఖాతాదారులను ఆకర్షించేందుకు బ్యాంకులు కూడా కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అంతేకాదు పాత పథకాల వడ్డీ రేట్లను సైతం పెంచుతున్నాయి. తాజాగా ప్రముఖ సహకార బ్యాంకు అయిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా తన వడ్డీ రేట్లను పెంచింది. కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంక్ తన FDపై 8.85 శాతం వడ్డీని అందిస్తోంది.

222 రోజుల FDపై వడ్డీ రేటు:

బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం, PSB ఉత్కర్ష్ 222 రోజుల FDలో, సూపర్ సీనియర్ సిటిజన్‌లు 8.85 శాతం చొప్పున వడ్డీని పొందుతారు. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లు 8.5 శాతం వడ్డీని పొందుతారు. సాధారణ కస్టమర్లు 222 రోజుల FDపై 8 శాతం వడ్డీని పొందుతారు. అయితే బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం 60 సంవత్సరాల కంటే ఎక్కువ 80 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని సీనియర్ సిటిజన్స్ అంటారు. అయితే, సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే 80 ఏళ్లు పైబడిన వారని గమనించాలి.

ఇవి కూడా చదవండి

300 రోజుల FD పై వడ్డీ రేటు:

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సూపర్ సీనియర్ సిటిజన్లకు 300 రోజుల FDపై 8.35 శాతం వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 8 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ఇది కాకుండా, సాధారణ ప్రజలు 300 రోజుల ఎఫ్‌డిలో పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీని పొందుతారు.

601 రోజుల FDపై వడ్డీ రేటు:

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఫ్యాబులస్ ప్లస్ 601 రోజుల FDపై సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.85 శాతం వడ్డీని ఇస్తోంది. ఈ ఎఫ్‌డిపై సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం, సామాన్యులకు 7 శాతం వడ్డీ లభిస్తుంది.

1051 రోజులకు FDపై వడ్డీ రేటు:

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ -1051 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కింద సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 7.85 శాతం వడ్డీని అందిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లు ఈ FDపై 7.5 శాతం వడ్డీని పొందుతారు. అదే సమయంలో, ఇతర కస్టమర్లకు 7 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి.