AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Finance Banks: ఈ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 9 శాతం కన్నా ఎక్కువ వడ్డీ పొందే అవకాశం.. పూర్తి వివరాలు

మనమందరం మన సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేస్తాము. పొదుపుపై    మంచి రాబడిని పొందడానికి ప్రయత్నిస్తాము.

Small Finance Banks: ఈ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 9 శాతం కన్నా ఎక్కువ వడ్డీ పొందే అవకాశం.. పూర్తి వివరాలు
Fd Rates
Madhavi
| Edited By: |

Updated on: Mar 13, 2023 | 12:56 PM

Share
మనమందరం మన సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేస్తాము. పొదుపుపై    మంచి రాబడిని పొందడానికి ప్రయత్నిస్తాము. దీని కోసం కొంత మంది ఎఫ్‌డిలో, మరికొందరు మ్యూచువల్ ఫండ్‌లో, మరికొందరు ఇతర వేర్వేరు పొదుపు పథకాలలో పెట్టుబడి పెడతారు. వీటిలో ఫిక్సెడ్ డిపాజిట్ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన సురక్షితమైన పొదుపు మార్గం.
ప్రజలు తమ సంపాదన నుండి పొదుపు చేసి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తారు. ప్రజలను ఆకర్షించడానికి బ్యాంకులు కూడా FD రేట్లను ఎక్కువగా ఆర్బీఐ వడ్డీ రేట్లకు అనుగుణంగా సవరిస్తూనే ఉంటాయి. ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచింది, ఆ తర్వాత FD రేట్లను బ్యాంకులు సవరించాయి. దేశంలోని పెద్ద బ్యాంకులతో పోల్చితే, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మంచి వడ్డీ రాబడిని ఇస్తున్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఈ బ్యాంకుల్లో FDపై బంపర్ వడ్డీ :
ఎఫ్‌డిలపై మంచి రాబడిని ఇవ్వడంలో చిన్నచిన్న పొదుపు ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బి) ముందున్నాయి. సుమారు 9 శాతానికి పైగా వడ్డీని చెల్లిస్తున్నాయి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD పై అత్యధిక వడ్డీని అందిస్తోంది. 1001 రోజుల డిపాజిట్లపై సాధారణ కస్టమర్లకు 9 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.5 శాతం వడ్డీని అందిస్తోంది. మరోవైపు, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 999 రోజుల డిపాజిట్‌పై 8.51 శాతం వడ్డీని అందిస్తోంది. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు తమ కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను అందజేయడానికి కారణం ఉంది.
చిన్న ఫైనాన్స్ బ్యాంకులు వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా మైక్రో ఫైనాన్స్ విభాగానికి రుణాలు ఇస్తాయి. ఇది కాకుండా, ఈ బ్యాంకులకు పెద్ద బ్యాంకులకు ఉన్నంత బాధ్యతలు కూడా ఉండవు. అందుకే కస్టమర్లను ఆకర్షించడానికి, ఈ చిన్న ఫైనాన్స్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సాధారణం కంటే ఎక్కువగా ఉంచుతాయి. తద్వారా ప్రజలు వారి వద్ద డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. .
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ :  9 శాతం
సూర్యోదయం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ :  8.51 శాతం
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ :  8.25 శాతం
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ :  8.25 శాతం
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ :  8.2 శాతం
GO స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ :  8.15 శాతం
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ :  8 శాతం
బంధన్ బ్యాంక్ 8 శాతం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్