AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debit Card Insurance: డెబిట్ కార్డు ఉంటే ఆ ఇన్సూరెన్స్ ఫ్రీ.. క్లెయిమ్ చేయడం ఎలాగంటే..?

భారతదేశంలో బ్యాంకు ఖాతా అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ప్రతి బ్యాంకు ఖాతాకు కచ్చితంగా ఏటీఎం కార్డు బ్యాంకులు అందిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో  డెబిట్ కార్డ్ హోల్డర్‌లకు కాంప్లిమెంటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్‌ను అందించే అనేక బ్యాంకులు భారతదేశంలో ఉన్నాయని చాలా మందికి తెలియదు. అయితే ఈ ఇన్సూరెన్స్ కొన్ని షరతులతో వస్తుంది. డెబిట్ కార్డ్ హోల్డర్ వాటిని అర్హత సాధిస్తే తప్ప జీవిత బీమా కవరేజ్ అందించరు.

Debit Card Insurance: డెబిట్ కార్డు ఉంటే ఆ ఇన్సూరెన్స్ ఫ్రీ.. క్లెయిమ్ చేయడం ఎలాగంటే..?
Credit Debit Cards
Nikhil
|

Updated on: Jul 08, 2024 | 8:14 PM

Share

భారతదేశంలో బ్యాంకు ఖాతా అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ప్రతి బ్యాంకు ఖాతాకు కచ్చితంగా ఏటీఎం కార్డు బ్యాంకులు అందిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో  డెబిట్ కార్డ్ హోల్డర్‌లకు కాంప్లిమెంటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్‌ను అందించే అనేక బ్యాంకులు భారతదేశంలో ఉన్నాయని చాలా మందికి తెలియదు. అయితే ఈ ఇన్సూరెన్స్ కొన్ని షరతులతో వస్తుంది. డెబిట్ కార్డ్ హోల్డర్ వాటిని అర్హత సాధిస్తే తప్ప జీవిత బీమా కవరేజ్ అందించరు. ముఖ్యంగా డెబిట్ కార్డ్ హోల్డర్ నిర్దిష్ట కాల వ్యవధిలో కనీసం ఒక నిర్దిష్ట రకమైన లావాదేవీని చేసి ఉండాలి. డెబిట్ కార్డ్‌తో కాంప్లిమెంటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్‌ను అందించే పద్ధతి సాధారణం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ ఇండియా వంటి అనేక ప్రముఖ బ్యాంకులు డెబిట్ కార్డ్‌లపై కాంప్లిమెంటరీ బీమా పాలసీని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెబిట్ కార్డు ఇన్సూరెన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

డెబిట్ కార్డ్ వినియోగాన్ని కవర్ చేసే బీమా పాలసీలు సాధారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉంటాయి. వ్యక్తిగత ప్రమాదం, కొనుగోలు రక్షణ, విమాన ప్రమాదం, కార్డ్ మోసం మొదలైన వాటికి కవరేజీని అందిస్తాయి. ఇవి గ్రూప్ పాలసీలు కాబట్టి, కార్డ్ హోల్డర్ స్థాయిలో స్వతంత్ర పాలసీ నంబర్‌లు ఉండవని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. డెబిట్ కార్డ్ హోల్డర్‌ మరణించిన సందర్భంలో వారి నామినీలు బీమాను ఎలా క్లెయిమ్‌ చేయాలనే విషయంలో చాలా మందికి అనుమానం ఉంటుంది. క్లెయిమ్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్న రకాల డెబిట్ కార్డులకు కొన్ని రకాల లావాదేవీలను నిర్దిష్టమైన రోజుల్లోపు చేయాలి. కోటక్ మహీంద్రాకు సంబంధించిన గోల్డ్, ప్లాటినం డెబిట్ కార్డ్ హోల్డర్‌లు గత 60 రోజులలో కనీసం 6 పాయింట్ ఆఫ్ సేల్ (POS) లేదా ఇ-కామర్స్ లావాదేవీని నిర్వహించడం అవసరం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్ కస్టమర్‌లకు గత 30 రోజుల్లో కనీసం ఒక పీఓఎస్ లేదా పేమెంట్ గేట్‌వే లావాదేవీ చేయాలి. 

బ్యాంక్ నిబంధనలు, షరతులకు అనుగుణంగా నామినీ లేదా పాలసీదారుకు సంబంధించిన క్లెయిమ్‌దారు నిర్దిష్ట పత్రాలతో నిర్ణీత వ్యవధిలోగా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది.  ముఖ్యంగా మరణించిన 60 రోజుల్లోపు బ్యాంకులో తెలియజేయాలి. అయితే వివిధ బ్యాంకులు వేర్వేరు నిబంధనలను కలిగి ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  కొన్ని బ్యాంకులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఈ పత్రాలను సమర్పించే సదుపాయాన్ని కూడా కలిగి ఉన్నాయి. కార్డుదారుడు మరణించిన దురదృష్టకర సందర్భంలో వ్యక్తిగత ప్రమాద బీమాను క్లెయిమ్ చేయడానికి నామినీ క్లెయిమ్ ఫారమ్, కస్టమర్ మరణ ధ్రువీకరణ పత్రం, నిర్దిష్ట పత్రాలు, నామినీకు సంబంధించిన కేవైసీ వివరాలను సమర్పించాలి. ఈ పత్రాలను బ్యాంక్ శాఖలో సమర్పించవచ్చు. లేదా కాల్ సెంటర్‌కు సమాచారం అందించాలి. ఒక్కోసారి అవసరమైన డాక్యుమెంట్‌లను ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..