Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Two-Wheeler Loan: బైక్ లోన్ కావాలా? ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి..

సాధారణంగా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి రుణాలపై ఆధారపడతారు. నెలవారీ వాయిదాలు చెల్లించే పద్ధతులతో ఈ రుణాలను మంజూరు చేస్తారు. ఇవి త్వరగా ఆమోదం పొందాలంటే, తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రుణానికి దరఖాస్తు చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.

Two-Wheeler Loan: బైక్ లోన్ కావాలా? ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి..
Two Wheeler Loan
Follow us
Madhu

|

Updated on: Jul 08, 2024 | 6:08 PM

దేశంలో ద్విచక్ర వాహనాల వినియోగం బాగా పెరిగింది. పేద, సామాన్య వర్గాల ప్రజలు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రయాణం, వ్యాపారం, ఉద్యోగ అవసరాల కోసం ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడానికి బ్యాంకులు, వివిధ సంస్థలు రుణాలను మంజూరు చేస్తున్నాయి. అయితే రుణాల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు కొన్ని అంశాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.

జాగ్రత్తలు తీసుకోండి..

సాధారణంగా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి రుణాలపై ఆధారపడతారు. నెలవారీ వాయిదాలు చెల్లించే పద్ధతులతో ఈ రుణాలను మంజూరు చేస్తారు. ఇవి త్వరగా ఆమోదం పొందాలంటే, తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రుణానికి దరఖాస్తు చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.

  • ద్విచక్ర వాహన రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందు వివిధ సంస్థలు అందించే ఆఫర్లను పరిశీలించాలి. వడ్డీ రేట్లు, లోన్ మొత్తం, రీపేమెంట్ నిబంధనలను తెలుసుకోవాలి.
  • రుణం తీసుకోవడానికి మీ అర్హతలను పరిశీలించండి. వయసు, ఆదాయం, ఉద్యోగ స్థితి, క్రెడిట్ స్కోర్ మొదలైనవి చాాలా అవసరం.
  • ప్రతినెలా ఈఎమ్ఐల రూపంలో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఉండే ఈఎమ్ఐలను ఎంపిక చేసుకోండి.
  • ద్విచక్ర వాహనం ధర, మీ ఆర్థిక పరిస్థితి ఆధారంగా లోన్ తీసుకోండి. రుణ భారం ఎక్కువగా ఉంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
  • మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే మీ రుణం తొందరగా మంజూరవుతుంది. అలాగే తక్కువ వడ్డీతో పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవాలి.
  • రుణ దరఖాస్తులో సహ దరఖాస్తుదారు, హామీదారుని జోడించడం వల్ల మెరుగైన వడ్డీ రేట్లతో లోన్ ఆమోదం పొందే అవకాశాలు పెరుగుతాయి. మీరు జోడించిన వ్యక్తికి మంచి క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఉండాలి.
  • దరఖాస్తు ఫారంలో పూర్తి చేసిన వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు తప్పు సమాచారం ఇస్తే రుణం మంజూరు ఆలస్యం కావచ్చు.
  • రుణాన్ని వేగంగా పొందడానికి అవసరమైన పత్రాలను అందజేయాలి. తద్వారా మీకు మొదటి ప్రయత్నంలోనే రుణం మంజూరు అవుతుంది.
  • నిబంధనలు, షరతులను అర్థం చేసుకోండి. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ ప్రీపేమెంట్, అదనపు ఛార్జీలు, దాచిన ఛార్జీలు, తప్పిన ఈఎమ్ఐలు, డిఫాల్ట్ పరిణామాలు మొదలైన వాటికి తెలుసుకోవాలి.

ఈ తప్పులు చేయవద్దు..

  • ద్విచక్ర వాహనం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఈ తప్పులు చేయకూడదు. బైక్ రుణం త్వరగా ఆమోదం పొందేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
  • దరఖాస్తు ఫారంలో తెలిపిన సమాచారమంతా నిజాయితీగా, కచ్చితంగా ఉండాలి.
  • రుణ కాల వ్యవధిని మరీ ఎక్కువగా పెట్టకోవద్దు. దానివల్ల వడ్డీ భారీగా పెరిగే అవకాశం ఉంది. బైక్ ఈఎమ్ఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీకు సరిపోయే వాయిదాలను ఎంచుకోండి.
  • ఈఎమ్ఐలను ఆలస్యం చెల్లించడం వల్ల జరిమానాలు, అధిక వడ్డీ ఖర్చులు, క్రెడిట్ స్కోర్‌కు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
  • మల్టిపుల్ లోన్ల కోసం దరఖాస్తు చేయడం మీకు ఇబ్బందిగా మారుతుంది. రుణ ఆమోదం పొందే మీ అవకాశాలను దెబ్బతీస్తుంది. క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోయి, రుణ అర్హత దెబ్బతింటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..