NPS vs PPF: ఆ రెండు పథకాలతో రిటైర్‌మెంట్ లైఫ్ హ్యాపీ.. కోటీశ్వరుడు కావడం గ్యారెంటీ..!

భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరిన నాటి నుంచే పదవీ విరమణ ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అందుకు ఇప్పటి నుంచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో అందుబాటులో ఉన్న పథకంలో పెట్టుబడి పెడతారు. అయితే ఇటీవల ఎన్‌పీఎస్ స్కీమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే రాబడి దృష్ట్యా ఏయే పథకం మంచిదో చాలా మంది అంచనా వేయలేరు. ముఖ్యంగా రూ. కోటి కంటే ఎక్కువ కార్పస్‌ను కూడబెట్టడం మీ లక్ష్యమైతే ఎన్‌పీఎస్, పీపీఎఫ్ రెండూ మంచి పెట్టుబడులుగా భావించాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

NPS vs PPF: ఆ రెండు పథకాలతో రిటైర్‌మెంట్ లైఫ్ హ్యాపీ.. కోటీశ్వరుడు కావడం గ్యారెంటీ..!
Senior Citizen
Follow us

|

Updated on: Jul 08, 2024 | 7:15 PM

భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరిన నాటి నుంచే పదవీ విరమణ ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అందుకు ఇప్పటి నుంచే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో అందుబాటులో ఉన్న పథకంలో పెట్టుబడి పెడతారు. అయితే ఇటీవల ఎన్‌పీఎస్ స్కీమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే రాబడి దృష్ట్యా ఏయే పథకం మంచిదో చాలా మంది అంచనా వేయలేరు. ముఖ్యంగా రూ. కోటి కంటే ఎక్కువ కార్పస్‌ను కూడబెట్టడం మీ లక్ష్యమైతే ఎన్‌పీఎస్, పీపీఎఫ్ రెండూ మంచి పెట్టుబడులుగా భావించాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండు పథకాల్లో మీకు సరిపోయే పథకాన్ని మీరు దేనిని ఎంచుకోవాలనే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌పీఎస్, పీపీఎఫ్ రెండు పథకాల్లో ప్రధాన తేడాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఎన్‌పీఎస్‌లో కనీస వార్షిక పెట్టుబడి రూ. 6,000గా ఉంటుంది. అయితే పెట్టుబడులపై గరిష్ట పరిమితి లేదు. మరోవైపు పీపీఎఫ్ ఖాతాల కోసం కనీస వార్షిక పెట్టుబడి రూ. 500, మీరు ఒక సంవత్సరంలో పెట్టుబడి పెట్టగలిగే గరిష్టం రూ. 1.5 లక్షలుగా ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి 30 సంవత్సరాల వయస్సులో పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించి 60 సంవత్సరాల వయస్సు వరకు అలానే కొనసాగిస్తే 30 సంవత్సరాల కాలానికి అంటే 15 సంవత్సరాల కనిష్ట లాక్ ఇన్ ప్లస్ 3 బ్లాక్ ఎక్స్‌టెన్షన్స్ 5 సంవత్సరాల లేదా 360 నెలలు పెట్టుబడి పెడితే 7.1 శాతం వడ్డీ రేటుతో రూ. 1.5 లక్షల వార్షిక సహకారంతో రూ. 1.5 కోట్లకు పైగా రిటర్న్స్ వస్తాయి. జాతీయ పెన్షన్ సిస్టమ్ రిటర్న్స్ విషయంలో నాలుగు అసెట్ క్లాసులు ఉన్నాయి అసెట్ క్లాస్ ఈ- ఈక్విటీ, సంబంధిత సాధనాలు, అసెట్ క్లాస్ సి – కార్పొరేట్ డెట్, సంబంధిత సాధనాలు, అసెట్ క్లాస్ జీ- ప్రభుత్వ బాండ్లు, సంబంధిత సాధనాలు మరియు అసెట్ క్లాస్ ఏ – వంటి సాధనాలతో సహా ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు సీఎంబీఎస్, ఎంబీఎస్, ఆర్ఈఐటీఎస్, ఏఐఎఫ్‌లు మొదలైనవి ఉంటాయి. మీరు నెలవారీ రూ. 12,500 పెట్టుబడితో 30 సంవత్సరాల వ్యవధిలో మీరు స్కీమ్ ఏ, స్కీమ్ జీ, స్కీమ్ సీ నుంచి 1.7 కోట్లకు పైగా రాబడిని పొందవచ్చు. 

పీపీఎఫ్‌లో వార్షిక పెట్టుబడి గరిష్ట మొత్తం అంటే రూ. 1.5 లక్షల వరకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. అదనంగా పీపీఎఫ్ అనేది ఈఈఈ ఉత్పత్తి అంటే సంపాదించిన వడ్డీ, మెచ్యూరిటీ ఆదాయం పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఎన్‌పీఎస్ విషయంలో రూ. 2 లక్షల (1.5 లక్షలు + రూ. 50,000) వరకు పన్ను మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. మెచ్యూరిటీ సమయంలో మొత్తం కార్పస్‌లో 60 శాతం పన్ను మినహాయింపు ఉంటుంది. యాన్యుటీలో పెట్టుబడి పెట్టబడిన మిగిలిన 40 శాతం కూడా మినహాయింపు పొందింది. అయితే యాన్యుటీ ద్వారా వచ్చే ఆదాయం మీ పన్ను స్లాబ్‌పై ఆధారపడి పన్ను విధిస్తారు. 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరుడు ఎన్‌పీఎస్ ఖాతాను తెరవవచ్చు. అయితే 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులు ఎవరైనా పీపీఎఫ్ ఖాతాను తెరవగలరు. అయితే ఎన్ఆర్ఐలు ఎన్‌పీఎస్ ఖాతాలను తెరవగలిగినప్పటికీ వారు పీపీఎఫ్‌ని ఎంచుకోలేరు. ఎన్‌పీఎస్‌లో మీరు పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!