Extortion Scam: కస్టమర్లకు ఆ బ్యాంక్ హెచ్చరిక.. ఆ స్కామ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

గతంలో మన సొమ్మును బందిపోటు దొంగలు దోచుకున్న చందాన ఇప్పుడు బ్యాంకు అకౌంట్‌లోని సొమ్మును తస్కరించేందుకు సైబర్ మోసగాళ్లు తయారయ్యారు. తాజాగా ఈ తరహా మోసం గురించి ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని రెండవ అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కస్టమర్లు ఎక్స్‌టార్షన్ స్కామ్‌లపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.

Extortion Scam: కస్టమర్లకు ఆ బ్యాంక్ హెచ్చరిక.. ఆ స్కామ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
Scam
Follow us

|

Updated on: Jul 08, 2024 | 7:00 PM

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ అనేది తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీలతో పాటు యూపీఐ లావాదేవీలు పెరగడంలో బ్యాంకు ఖాతాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే గతంలో మన సొమ్మును బందిపోటు దొంగలు దోచుకున్న చందాన ఇప్పుడు బ్యాంకు అకౌంట్‌లోని సొమ్మును తస్కరించేందుకు సైబర్ మోసగాళ్లు తయారయ్యారు. తాజాగా ఈ తరహా మోసం గురించి ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని రెండవ అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కస్టమర్లు ఎక్స్‌టార్షన్ స్కామ్‌లపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మన ఫొటోలు లేదా వీడియోలు మార్ఫ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు పంపుతామని బెదిరిస్తుంటారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి హెచ్చరికలు చేసిందో ఓ సారి తెలుసుకుందాం.

ఎక్స్‌టార్షన్ స్కామ్‌లు చేసే వారు ముందుగానే వినియోగదారుల ప్రైవేట్ ఫోటోలు లేదా గ్రహీతకు సంబంధించిన వ్యక్తిగత డేటా వంటి సమాచారం తమ వద్ద ఉందని మెయిల్ చేస్తారు. ఒకవేళ వినియోగదారుడు తమ మెయిల్స్‌ను లెక్కచేయకపోతే ఫొటోలను మార్ఫ్ చేసి కుటుంబ సభ్యులకు పంపుతామని హెచ్చరిస్తారు. ముఖ్యంగా వినియోగదారులను భయపెట్టి డబ్బు గుంజాలనే ప్రయత్నంలోనే ఉంటారని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఐసీఐసీఐ బ్యాంకు తన ఈ-మెయిల్‌లో స్కామ్‌ను గుర్తించడంలో సహాయపడే కొన్ని హెచ్చరిక సంకేతాలను హైలైట్ చేస్తుంది. ఇవి ప్రభుత్వ శాఖ, రుణ సేకరణ ఏజెన్సీ లేదా విశ్వసనీయ సంస్థ నుంచి వచ్చినట్లు నమ్మిస్తారు. కాల్ చేసిన వ్యక్తి మీకు డబ్బు చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లేదా అరెస్టు చేస్తామని బెదిరిస్తాడు. ముఖ్యంగా కొంత మంది జరిమానా కట్టాలనే నెపంతో డబ్బును దోచుకుంటారని ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది. ముఖ్యంగా స్కామర్లు మీ పాస్‌పోర్ట్ వివరాలు, పుట్టిన తేదీ లేదా బ్యాంక్ సమాచారం వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా అడగే అవకాశం ఉంది. జరిమానా చెల్లించకుంటే పోలీసులు మీ ఇంటి వద్దకు వచ్చి మిమ్మల్ని అరెస్టు చేస్తారని కాల్ చేసిన వ్యక్తి బెదిరిస్తాడి పేర్కొంది. అందువల్ల కస్టమర్లు ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్ స్కామ్‌ల నుంచి రక్షణ ఇలా

  • డబ్బు డిమాండ్ చేసే బెదిరింపు కాల్‌ల ద్వారా ఒత్తిడి గురికాకుండా వాటిని పట్టించుకోకపోవడం మేలు. 
  • బహుమతులు, వోచర్‌లు ఇతర లావాదేవీల ద్వారా ఎవరికీ సొమ్ము బదిలీ చేయవద్దు
  • మీకు కాల్ చేసిన కాలర్ అందించిన ఏ సంప్రదింపు వివరాలను ఉపయోగించవద్దు. సంబంధిత సంస్థకు నేరుగా కాల్ చేయడం ద్వారా వారి గుర్తింపును ధ్రువీకరించుకోవాలి. ఆ సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి వివరాలను తనిఖీ చేయడం ఉత్తమం. 
  • టెక్స్ట్‌లు లేదా ఈ-మెయిల్‌లకు ప్రతిస్పందించవద్దు. మీరు ఇలా చేస్తే స్కామర్‌లు మీ డబ్బును పొందడానికి వారి దోపిడీ ప్రయత్నాలను పెంచుతారు.
  • మీకు తెలియని లేదా విశ్వసించని ఎవరికైనా డబ్బు పంపవద్దు లేదా క్రెడిట్ కార్డ్, ఆన్‌లైన్ ఖాతా వివరాలు లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు సమాచారాన్ని ఎప్పుడూ ఇవ్వవద్దు. వాటిని ఈ-మెయిల్ ద్వారా లేదా ఫోన్ ద్వారా ఎప్పుడూ షేర్ చేయవద్దు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!