Gold Rules: మీ దగ్గర బంగారం ఉందా..? పరిమితికి మించి బంగారం ఉంటే ఆ ఇబ్బందులు తప్పవంతే..!

ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తే భారతదేశంలో మాత్రం దాన్ని ఆభరణంగా చూస్తారు. ఈ నేపథ్యంలో ఏళ్లుగా భారతీయుల దగ్గర బంగారం అనేది ఉంటుంది. కచ్చితంగా ప్రతి కుటుంబం వద్ద ఆభరణాల రూపంలో కొంత మొత్తంలో బంగారం ఉంటుంది. అయితే ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో? నిర్దిష్టమైన పరిమితులు ఉన్నాయని చాలా మందికి తెలియదు. నిబంధనలు తెలియక చాలా మంది జరిమానాలు చెల్లిస్తున్నారు.

Gold Rules: మీ దగ్గర బంగారం ఉందా..? పరిమితికి మించి బంగారం ఉంటే ఆ ఇబ్బందులు తప్పవంతే..!
Gold Rate
Follow us

|

Updated on: Jul 08, 2024 | 6:45 PM

భారతదేశంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు బంగారంపై అధిక మక్కువ చూపుతారు. ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తే భారతదేశంలో మాత్రం దాన్ని ఆభరణంగా చూస్తారు. ఈ నేపథ్యంలో ఏళ్లుగా భారతీయుల దగ్గర బంగారం అనేది ఉంటుంది. కచ్చితంగా ప్రతి కుటుంబం వద్ద ఆభరణాల రూపంలో కొంత మొత్తంలో బంగారం ఉంటుంది. అయితే ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో? నిర్దిష్టమైన పరిమితులు ఉన్నాయని చాలా మందికి తెలియదు. నిబంధనలు తెలియక చాలా మంది జరిమానాలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారం విషయంలో అసలైన నిబంధనల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

భారతదేశంలో బంగారం కొనుగోలు, నిల్వకు సంబంధించి ప్రభుత్వం నియమాలను ఏర్పాటు చేసింది. ఈ నిబంధనల ప్రకారం వివాహిత మహిళ ఇంట్లో 500 గ్రాముల వరకు బంగారాన్ని ఉంచుకోవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీ) ప్రకారం మీరు నిర్దిష్ట మొత్తంలో బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. అయితే మీ వద్ద ఎంత బంగారం ఉన్నా, మీరు దానిని ఎలా పొందారు అనేదానికి రుజువు ఉండాలి. ముఖ్యంగా వివాహిత మహిళ తన వద్ద 500 గ్రాముల బంగారాన్ని ఉంచుకోవచ్చని ఆదాయపు పన్ను చట్టాలు చెబుతున్నాయి . పెళ్లికాని మహిళల బంగారం పరిమితిని 250 గ్రాములుగా ఉంచారు. కుటుంబంలోని పురుషులు 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవడానికి అనుమతిస్తారు. మీరు ప్రకటించిన ఆదాయం లేదా పన్ను మినహాయింపు ఆదాయం (వ్యవసాయం వంటివి) నుంచి బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే లేదా చట్టబద్ధంగా వారసత్వంగా పొందితే ఆ బంగారంపై పన్ను ఉండదు. దాడులు చేస్తే నిర్ణీత పరిమితిలో దొరికిన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకోలేరు. 

బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. బంగారం విక్రయిస్తే దానిపై పన్ను చెల్లించాలి. మీరు 3 సంవత్సరాల పాటు బంగారాన్ని హోల్డ్ చేసిన తర్వాత విక్రయిస్తే వచ్చే లాభం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు లోబడి ఉంటుంది. దీని రేటు 20 శాతంగా ఉంటుంది. అలాగే సావరిన్ గోల్డ్ బాండ్లను 3 సంవత్సరాలలోపు విక్రయిస్తే ఆ లాభం విక్రేత ఆదాయానికి జోడిస్తారు. పన్ను స్లాబ్ ప్రకారం ఆదాయపు పన్ను విధిస్తారు. మూడు సంవత్సరాల తర్వాత విక్రయిస్తే లాభంపై 20 శాతం ఇండెక్సేషన్ లేకుండా పన్ను విధిస్తారు. అయితే మెచ్యూరిటీ వరకు బాండ్‌ని ఉంచినట్లయితే, లాభాలపై పన్ను ఉండదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
బాబోయ్‌.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!