Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Aadhaar Link: పది రోజుల్లో ఆ పని చేయకపోతే మీ డబ్బు ఫసక్‌.. పొదుపు ఖాతాలున్న వారికి బ్యాంకుల అలెర్ట్‌..

టీవల ప్రభుత్వం ఈ ఖాతాలకు ఆధార్‌, పాన్‌ లింక్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దఫదఫాలుగా ఈ లింకింగ్‌ సమయాన్ని పొడిగించింది. అయితే తాజాగా ఈ గడువు ఈ నెల 30తో ముగియనుంది. పీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎస్సీఎస్‌ఎస్‌ వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టిన వారు ఆయా ఖాతాలతో ఆధార్ కార్డ్, పాన్‌లను లింక్ చేయాల్సి ఉంటుంది. గడవు సమయంలో లోపు ప్రక్రియను పూర్తి చేయకపోతే ఖాతాను స్తంభింపజేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకింగ్‌ సంస్థలు ఆదేశాలు ఇచ్చింది.

Pan Aadhaar Link: పది రోజుల్లో ఆ పని చేయకపోతే మీ డబ్బు ఫసక్‌.. పొదుపు ఖాతాలున్న వారికి బ్యాంకుల అలెర్ట్‌..
Pan Aadhaar
Follow us
Srinu

|

Updated on: Sep 22, 2023 | 4:00 PM

బ్యాంకింగ్‌ రంగంపై నమ్మకం పెరగడంతో ప్రజలు తమ సొమ్మును నమ్మకమైన రాబడి కోసం వివిధ బ్యాంకింగ్‌ పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ప్రజలను పొదుపు వైపు మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలను రూపొందించి వాటికి అధిక వడ్డీని ఆఫర్‌ చేస్తుంది. దీంతో అధిక శాతం మంది ప్రజలు చిన్న మొత్తాల పొదుపు ఖాతాల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఈ ఖాతాలకు ఆధార్‌, పాన్‌ లింక్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దఫదఫాలుగా ఈ లింకింగ్‌ సమయాన్ని పొడిగించింది. అయితే తాజాగా ఈ గడువు ఈ నెల 30తో ముగియనుంది. పీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ, ఎస్సీఎస్‌ఎస్‌ వంటి చిన్న పొదుపు పథకాలలో పెట్టుబడి పెట్టిన వారు ఆయా ఖాతాలతో ఆధార్ కార్డ్, పాన్‌లను లింక్ చేయాల్సి ఉంటుంది. గడవు సమయంలో లోపు ప్రక్రియను పూర్తి చేయకపోతే ఖాతాను స్తంభింపజేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకింగ్‌ సంస్థలు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ నెలఖరులోపు పొదుపు ఖాతాలకు పాన్‌, ఆధార్‌ లింక్‌ అవ్వకపోతే ఆయా ఖాతాలు స్తంభిస్తాయి. 

ఖాతాలు ఎందుకు స్తంభింపజేస్తారు?

గడువులోపు పెట్టుబడిదారులు తమ ఆధార్, పాన్‌లను పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీ లేదా ఎస్‌సీఎస్‌ఎస్‌తో లింక్ చేయడంలో విఫలమైతే ఈ చిన్న పొదుపు పథకాలలో వారి పెట్టుబడులు స్తంభింపజేస్తారు. అంతేకాకుండా పెట్టుబడిదారులు తమ డిపాజిట్లపై వడ్డీ రాబడి వంటి ప్రయోజనాలను పొందలేరు. కొన్ని షరతులు సంతృప్తి చెందినప్పుడు ప్రభుత్వ పొదుపు ప్రమోషన్ చట్టంలోని ఏదైనా స్కీమ్‌లో భాగంగా ఖాతా తెరవడానికి పెట్టుబడిదారులు తప్పనిసరిగా ఆధార్ నంబర్, పాన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

లింకింగ్‌ ఎందుకు?

పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీతో పాటు అనేక ఇతర చిన్న పొదుపు పథకాల కోసం ఆధార్, పాన్ రెండింటిని లింక్ చేయడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కూడా ఈ అవసరాన్ని పాటించేందుకు తమ ఆధార్ నంబర్లను తప్పనిసరిగా అందించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక డిపాజిటర్ ఇప్పటికే ఖాతా తెరిచి తన ఆధార్ నంబర్‌ను ఖాతాల కార్యాలయానికి సమర్పించకపోతే ఖాతాలు స్తంభింపజేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నూతన ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు సూచించింది. ఇలా లింక్‌ చేయడానికి ఆఖరి సారి ఆరు నెలల గడువు ఇచ్చింది. సెప్టెంబర్‌ 30తో గడువు ముగుస్తుంది కాబట్టి కచ్చితంగా ఖాతాలకు ఆధార్‌, పాన్‌ లింక్‌ చేయాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

లింక్‌ చేయకపోతే నష్టాలివే

  • డిపాజిట్‌ వడ్డీ పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేయరు.
  • వ్యక్తులు తమ పీపీఎఫ్‌ లేదా సుకన్య సమృద్ధి ఖాతాలలో డిపాజిట్లు చేయడంలో పరిమితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  • మెచ్యూరిటీ మొత్తం పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేయరు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..