Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adhaar-PAN Link: సమయం లేదు మిత్రమా.. ఇక ఒక్క రోజే గడువు.. ఈ లోపు అది పూర్తి చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

వాస్తవానికి ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసినప్పటికీ రూ. 1000 అపరాధ రుసుంతో జూన్ 30 వరకూ అవకాశం ఇచ్చింది. ఇది కూడా ముగిసిపోతుండటంతో అందరూ ఒకసారి లింక్ చేశారో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంది.

Adhaar-PAN Link: సమయం లేదు మిత్రమా.. ఇక ఒక్క రోజే గడువు.. ఈ లోపు అది పూర్తి చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
Aadhaar - PAN
Follow us
Madhu

|

Updated on: Jun 29, 2023 | 6:00 PM

పాన్, ఆధార్ నంబర్ తో లింక్ చేయడానికి ఇక ఒక్క రోజే సమయం ఉంది. జూన్ 30తో ప్రభుత్వం విధించిన గడువు ముగుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసినప్పటికీ రూ. 1000 అపరాధ రుసుంతో జూన్ 30 వరకూ అవకాశం ఇచ్చింది. ఇది కూడా ముగిసిపోతుండటంతో అందరూ ఒకసారి ఆధార్ పాన్ లింక్ చేశారో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంది. వాస్తవానికి పాన్ అనేది పర్మనెంట్ అకౌంట్ నంబర్. దీనిలో అంకెలు, ఇంగ్లిష్ అక్షరాలతో సమ్మిళతమైన 10 డిజిట్లు ఉంటాయి. దీనిని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఇస్తుంది. దీనిని ఉపయోగించి వినియోగదారుల రాబడులు, ఖర్చులు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల వివరాలు తెలుసుకుంటారు. దీనిలో వ్యక్తుల పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫొటో ఉంటుంది. దీనిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. మీ ఆర్థిక లావాదేవీలన్నీ దీని ఆధారంగానే జరుగుతాయి. అలాగే ఆధార్ అనేది 12 అంకెలతో కూడిన గుర్తింపు కార్డు. దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇస్తుంది. 2017 నుంచి పాన్, ఆధార్ లింక్ చేయడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆధార్, పాన్ లింక్ చేయకపోతే?

మీరు నిర్ణీత గడువులోగా పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయకపోతే మీ పాన్ కార్డు తాత్కాలికంగా నిలిచిపోతుంది. అది పనిచేయకపోతే చాలా రకాల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఆ ఇబ్బందులేంటో చూద్దాం రండి..

  • మీరు పని చేయని పాన్ ఉపయోగించి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు.
  • పెండింగ్‌లో ఉన్న రిటర్న్‌లు ప్రాసెస్ చేయరు.
  • పాన్ నంబర్ పనిచేయకపోతే పెండింగ్ రిఫండ్స్ జారీ చేయరు.
  • లోపభూయిష్ట రిటర్న్‌ల విషయంలో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్‌లు పూర్తి చేయడం సాధ్యం కాదు.
  • పాన్ పనిచేయకుండా పోయినందున ఎక్కువ రేటుతో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ఎలా?

పాన్-ఆధార్‌ని ఆన్‌లైన్‌లో లింక్ చేయడానికి ఈ కింద సూచించిన విధంగా చేయండి..

ఇవి కూడా చదవండి

ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ద్వారా..

  • అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ లోకి వెళ్లండి.
  • దానిలో క్విక్ లింక్స్ ట్యాబ్ లోకి వెళ్లి లింక్ ఆధార్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. ఇలా కాకుండా మీరు నేరుగా లింక్ ఆప్షన్ లోకి వెళ్లడానికి ఈ లింక్ ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు అవసరమైన వివరాలను నమోదు చేయడానికి ఒక ఫారమ్ కనిపిస్తుంది.
  • మీ ఆధార్ కార్డ్‌లో పేర్కొన్న విధంగా మీ పాన్, ఆధార్ నంబర్, పేరును నమోదు చేయండి. కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి.
  • మీ ఆధార్ కార్డ్‌లో మీ పుట్టిన సంవత్సరం మాత్రమే పేర్కొనబడి, పూర్తి పుట్టిన తేదీని పేర్కొనకపోతే, మీరు దానిని సూచించే పెట్టెలో టిక్ చేయాలి.
  • వివరాలను నమోదు చేసిన తర్వాత, మీరు ధృవీకరణ ప్రయోజనాల కోసం క్యాప్చా కోడ్ ని కూడా పూరించాలి.
  • మీ వద్ద మీ ఆధార్ కార్డ్ మాత్రమే ఉంటే.. పాన్ కార్డ్ లేకపోతే, మీరు “ఐ హావ్ ఓన్లీ ఆధార్” ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
  • అవసరమైన అన్ని వివరాలను పూరించిన తర్వాత, “లింక్ ఆధార్” బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీరు నమోదు చేసిన వివరాలు ఆధార్ డేటాబేస్‌లోని సమాచారంతో సరిపోలితే, మీ పాన్ విజయవంతంగా ఆధార్‌తో లింక్ చేయబడుతుంది.

ఎస్ఎంఎస్ ద్వారా కూడా చేయొచ్చు..

స్టెప్ 1: ఎస్ఎంఎస్ పంపడానికి మొబైల్ పరికరంలో 567678 లేదా 56161కి డయల్ చేయండి. ఫార్మాట్ తప్పనిసరిగా UIDPAN (10-అంకెల పాన్ కార్డ్ నంబర్), 12-అంకెల ఆధార్ కార్డ్ నంబర్ తర్వాత స్పేస్ ఉండాలి.

స్టెప్ 2: దాని ద్వారా ఒక ఎస్ఎంఎస్ మీకు వస్తుంది. అది పాన్-ఆధార్ లింక్ స్థితిని మీకు తెలియజేస్తుంది. పన్ను చెల్లింపుదారుల పుట్టిన తేదీ రెండు డాక్యుమెంట్లతో సరిపోలితే మాత్రమే ఆధార్, పాన్ లింక్ అవుతాయి.

  • అదే పాన్/ఆధార్ లింకింగ్ సెంటర్‌లో మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, మీరు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ రెండూ తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

ఇవి మర్చిపోకండి..

  • మీరు ఆధార్ పాన్ లింక్ చేస్తున్నప్పుడు.. తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పాన్, ఆధార్ నంబర్‌ను కలిగి ఉండాలి.
  • మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా మీ ఆధార్ కార్డ్‌కి లింక్ చేసి ఉండాలి.
  • మీరు సరైన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి లేదా ఎస్ఎంఎస్ చేయాలి.
  • మీ పాన్, ఆధార్ లింక్ చేయడంలో మీకు ఏవైనా సమస్యలు ఉంటే, మీరు ఆదాయపు పన్ను శాఖ లేదా యూఐడీఏఐని సంప్రదించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..