FD Interest Rates: సీనియర్ సిటిజన్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏకంగా 8.5 శాతం వడ్డీ ఆఫర్

గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై గణనీయంగా వడ్డీ రేట్లు పెరిగాయి. అయితే గత రెండు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేట్ యథాతథంగా ఉంచడంతో బ్యాంకులు కూడా ఎఫ్‌డీల వడ్డీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయితే కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తున్నాయి.

FD Interest Rates: సీనియర్ సిటిజన్లకు ఆ బ్యాంకు శుభవార్త.. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏకంగా 8.5 శాతం వడ్డీ ఆఫర్
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: Jun 29, 2023 | 5:30 PM

జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన రాబడి వివిధ పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు తాము రిటైరయ్యాక వచ్చే సొమ్మును కచ్చితం ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. డిపాజిట్ చేసిన సొమ్ముకు గ్యారెంటీ లభించడంతో పాటు కచ్చితంగా వడ్డీ సొమ్ము లభిస్తుందనే హామీతో చాలా మంది ఎఫ్‌డీ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. బ్యాంకులు కూడా సీనియర్ సిటిజన్లను ఆకట్టుకోవడానికి ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తూ ఉంటారు. గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లపై గణనీయంగా వడ్డీ రేట్లు పెరిగాయి. అయితే గత రెండు త్రైమాసికాల నుంచి ఆర్‌బీఐ రెపో రేట్ యథాతథంగా ఉంచడంతో బ్యాంకులు కూడా ఎఫ్‌డీల వడ్డీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అయితే కస్టమర్లను ఆకట్టుకోవడానికి కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తున్నాయి. తాజాగా డీసీబీ బ్యాంక్ పొదుపు ఖాతాలు, 2 కోట్ల రూపాయల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. డీసీబీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం కొత్త రేట్లు జూన్ 28, 2023 నుంచి అమల్లోకి. రివిజన్ తర్వాత సాధారణ కస్టమర్లకు 8 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.50 శాతం వడ్డీ రేటు ఫిక్స్డ్ డిపాజిట్లపై లభించనుంది. 

డీసీబీ వడ్డీ రేట్లు ఇలా

ఏడు రోజుల నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే రెసిడెంట్ టర్మ్ డిపాజిట్లపై బ్యాంక్ 3.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే 46 రోజుల నుంచి 90 రోజుల మధ్య కాలవ్యవధిపై 4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. డీసీబీ బ్యాంక్ 91 రోజుల నుంచి 6 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లు 4.75 శాతం, 6 నెలల నుండి 12 నెలల లోపు మెచ్యూరిటీ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ లభించనుంది. 12-15 నెలల మధ్య మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని పొందుతారు. అయితే బ్యాంక్ 18 నెలల నుంచి 700 రోజుల లోపు డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీని అందిస్తుంది. 700-36 నెలల మధ్య మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లు ఇప్పుడు 8 శాతం చొప్పున వడ్డీని పొందుతాయి. 36 నెలల నుంచి 120 నెలల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై డీసీబీ బ్యాంక్ 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు ఇలా

డీసీబీ బ్యాంక్ సీనియర్ సిటిజన్ కస్టమర్‌ల కోసం వడ్డీ రేట్లు 7-నుండి 120 నెలల కాలవ్యవధికి 4.25 శాతం నుంచి 8.50 శాతం వరకూ వడ్డీ రేటును అందిస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ