జీరో నుంచి రూ.50 వేల వరకు.. ఈ బ్యాంక్‌లో ఎంత మినిమం బ్యాలెన్స్ ఉండాలో తెలుసా?
ఐసిఐసిఐ బ్యాంక్ పొదుపు ఖాతాలకు కనీస బ్యాలెన్స్‌ను పెంచడంపై ఈ వ్యాసం చర్చిస్తుంది. మెట్రో ప్రాంతాల్లో రూ.50,000కు పెంచగా, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000కు పెంచారు. ఇతర బ్యాంకులు, ముఖ్యంగా SBI, PNBలు ఈ విధమైన కఠినమైన నిబంధనలను అమలు చేయకపోవడం గమనార్హం.

అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ ఇటీవల ఆగస్టు 1న తమ బ్యాంక్‌లోని సేమింగ్స్ అకౌంట్స్‌లో మినిమం బ్యాలెన్స్ రూ.10,000 నుండి రూ.50,000కి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనిపై చాలా మంది విమర్శలు చేశారు. ఎందుకంటే ఇది తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆర్థిక, బ్యాంకింగ్ సేవలను పొందకుండా అడ్డంకిగా మారుతుందని అంటున్నారు. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఉండే బ్యాంక్‌లకు ఈ రూ.50 వేల మినిమం బ్యాలెన్స్ రూల్ వర్తించనుంది.
అలాగే సెమీ-అర్బన్ శాఖలలో ఇది రూ.5,000 నుండి రూ.25,000 కు పెంచారు. గ్రామీణ శాఖలలో రూ.5,000 నుండి రూ.10,000 కు రెట్టింపు చేశారు. అయితే ఈ అధిక మినిమం బ్యాలెన్స్ కొత్త రూల్ ఆగస్టు 1 తర్వాత తెరిచిన కొత్త ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. ఈ నిబంధనను పాటించడంలో విఫలమైన కస్టమర్లు లోటులో 6 శాతం లేదా రూ.500 ఏది తక్కువైతే అది జరిమానాగా విధించనున్నారు.
దీనికి విరుద్ధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి ఇతర బ్యాంక్‌లు గ్రామీణ, పట్టణ మెట్రో ప్రాంతాల్లో మినిమం బ్యాలెన్స్ పేరిట కస్టమర్లపై పెద్దగా భారం మోపడం లేదు. 2020లో SBI గ్రామీణ, మెట్రోలకు సంబంధించిన అన్ని పొదుపు ఖాతాలపై MABని రద్దు చేసింది. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), కెనరా బ్యాంక్ అన్ని పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (MAB) నిర్వహించనందుకు జరిమానా ఛార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. అన్ని రకాల పొదుపు బ్యాంకు ఖాతాలకు సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) అవసరాన్ని తొలగించడం ద్వారా వారు దాని పొదుపు ఖాతాదారులకు గణనీయమైన ఉపశమనం కలిగించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




