Hyundai ioniq 5: గత ఏడాది బెస్ట్‌ అవార్డ్‌ దక్కించుకున్న ఎలక్ట్రిక్‌ కార్‌ ఇదే.. షారూఖ్‌ ఖాన్‌ చేతుల మీదుగా విడుదల.. ఫీచర్స్‌ అదుర్స్‌

ఇదే క్రమంలో సౌత్ కొరియా ఆటో మొబైల్ దిగ్గజం హ్యూందాయ్ తన ఎలక్ట్రిక్ కార్లలో రెండో ఎస్ యూవీ మోడల్ హ్యూందాయ్ ఐయానిక్ 5ను ఇండియాలో విడుదల చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆటో ఎక్స్ పో 2023లో ఈ కారును ఆవిష్కరించారు.

Hyundai ioniq 5: గత ఏడాది బెస్ట్‌ అవార్డ్‌ దక్కించుకున్న ఎలక్ట్రిక్‌ కార్‌ ఇదే.. షారూఖ్‌ ఖాన్‌ చేతుల మీదుగా విడుదల.. ఫీచర్స్‌ అదుర్స్‌
Hyundai Ioniq 5
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 12, 2023 | 4:22 PM

ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లు దూసుకొస్తున్నాయి. ఆటో ఎక్స్ పో 2023 వేదికగా దిగ్గజ కార్ల కంపెనీలు తమ కొత్త వేరియంట్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇదే క్రమంలో సౌత్ కొరియా ఆటో మొబైల్ దిగ్గజం హ్యూందాయ్ తన ఎలక్ట్రిక్ కార్లలో రెండో ఎస్ యూవీ మోడల్ హ్యూందాయ్ ఐయానిక్ 5ను ఇండియాలో విడుదల చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఆటో ఎక్స్ పో 2023లో ఈ కారును ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఫీచర్లు, స్పెసికేషన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రీ బుకింగ్స్ ప్రారంభం..

మన దేశంలో హ్యూందాయ్ కంపెనీ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లలో రెండోది ఈ ఐయానిక్ 5. దీని ఎక్స్ షోరూం ధర మొదటి 500 కస్టమర్లకు రూ. 44.95 లక్షలకు ఇవ్వనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. రూ. లక్షతో ప్రీ బుకింగ్స్ కూడా ప్రారంభించింది.

కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు..

హ్యూందాయ్ ఐయానిక్ 5 ను మొదటి సారి 2019లో ఫ్రాంక్ ఫర్ట్ మోటార్ షోలో 45 ఈవీ కాన్సెప్ట్ భాగంగా లో ప్రదర్శించారు.  కియా ఈవీ6 కార్ కు పోటీగా హ్యూందాయ్ దీనిని ఆవిష్కరించింది. ఈ క్రమంలో ఈ కారు 2022 లో వరల్డ్ కార్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ డిజైన్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ లను అందుకుంది.

ఇవి కూడా చదవండి

స్పెసిఫికేషన్లు ఇవి..

ఐయానిక్ 5 కారు 72.6 kWh బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది. ఇది 631 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. దీనిలోని బ్యాటరీ 350 kw డీసీ చార్జర్ తో 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకూ చార్జ్ అవుతుంది. మ్యాటీ గ్రావిటీ గోల్డ్, ఆప్టిక్ వైట్, మిడ్ నైట్ బ్లాక్ పెరల్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

ఐయానిక్ 6 కూడా..

హ్యూందాయ్ కంపెనీ తన మూడో ఎలక్ట్రిక్ వేరియంట్ మోడల్ ఐయానిక్ 6ను ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ సెడాన్ మోడల్ లో దీనిని తీసుకొస్తోంది. ఇది కూడా కియా ఈవీ6 మోడల్ కు పోటీగా హ్యూందాయ్ కంపెనీ తీసుకొస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!