Hyundai alcazar: అదిరిపోయే లుక్‌తో నయా కారు రిలీజ్ చేసిన హ్యూందాయ్.. బుకింగ్స్ ఓపెన్

హ్యుందాయ్ కంపెనీ కార్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్లతో ఈ కంపెనీ దూసుకుపోతోంది. హ్యుందాయ్ నుంచి విడుదలయ్యే కొత్త కార్ల విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో తమ ఖాతాదారులకు కంపెనీ శుభవార్త చెప్పింది.

Hyundai alcazar: అదిరిపోయే లుక్‌తో నయా కారు రిలీజ్ చేసిన హ్యూందాయ్.. బుకింగ్స్ ఓపెన్
Hyundai Alcazar
Follow us
Srinu

|

Updated on: Aug 24, 2024 | 9:43 PM

హ్యుందాయ్ కంపెనీ కార్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్లతో ఈ కంపెనీ దూసుకుపోతోంది. హ్యుందాయ్ నుంచి విడుదలయ్యే కొత్త కార్ల విడుదల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో తమ ఖాతాదారులకు కంపెనీ శుభవార్త చెప్పింది. కొత్త హ్యందాయ్ అల్కాజార్ బుక్కింగ్ లను ప్రారంభించింది. ఆ కారు ఫీచర్లు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ ఎంఐఎల్ సరికొత్త హ్యుందాయ్ అల్కాజర్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. దేశంలోని కంపెనీకి చెందిన అధికారిక డీలర్‌షిప్‌లలో రూ.25 వేలు టోకెన్ మొత్తం చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. కొత్తగా విడుదల చేస్తున్న అల్కాజర్ ఎస్ యూవీ అధికారిక చిత్రాలను కూడా వినియోగదారుల కోసం విడుదల చేసింది. ఈ చిత్రాలను పరిశీలిస్తే డిజైన్ పరంగా కొత్తగా చేసిన మార్పులను గమనించవచ్చు. బోల్డ్ ఫ్రంట్ బంపర్, హుడ్ డిజైన్, స్కిడ్ ప్లేట్ , డార్క్ క్రోమ్ గ్రిల్ ఏర్పాటు చేశారు. హెచ్ ఆకారపు ఎల్ ఈడీ డీఆర్ఎల్ లు, క్వాడ్ బీమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లతో కొత్త లుక్ తీసుకువచ్చారు. 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ క్లాడింగ్, బ్రిడ్జ్ టైప్ రూఫ్ రెయిల్‌ తో పాటు వెనుక డిజైన్ ఆకట్టుకుంటోంది. సిగ్నేచర్ కనెక్ట్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, కొత్త టెయిల్‌గేట్, ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన స్పాయిలర్, రీ డిజైన్ చేయబడిన బంపర్, స్కిడ్ ప్లేట్ వంటి వాటితో కొత్త కారుకు మరింత అందం వచ్చింది.

అల్కాజర్ కారులోని క్యాబిన్ లో అప్ డేట్ ఫీచర్లను చేశారు. సుమారు 70కి పైగా కార్ ఫీచర్లు, 6, 7 సీట్ల ఎంపికతో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. భద్రతా పరంగా అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపు 40 స్టాండర్డ్ ఫీచర్లు, అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కొత్త కారు విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో 1.5 టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది. దీనితో పాటు 6 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో 1.5 U2 సీఆర్డీఐ డీజిల్ ఇంజిన్ తో కూడా లభిస్తుంది. కొత్త ఆల్కాజర్ కారు ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ వేరియంట్లలో లభిస్తుంది. ఎమరాల్డ్ మాట్ ఫినిషింగ్‌తో తొమ్మిది రకాల రంగులలో ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి