Ampere Electric Scooters: యాంపియర్ ఈవీలపై బంపర్ ఆఫర్.. రూ. 10వేల వరకూ తగ్గింపు.. మిస్ కాకండి..
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (జీఈఎమ్ పీఎల్)కు చెందిన యాంపియర్ మాగ్నస్, రియో లి ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు బాగా తగ్గాయి. దేశ మార్కెట్ లోకి తన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన తర్వాత యాంపియర్ తన పాత మోడళ్లలో కొన్నింటి ధరలు తగ్గించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా రియో లీ ప్లస్, మాగ్నస్ ఎల్‌టీ, మాగ్నస్ ఈఎక్స్ ధరలను రూ.10 వేల వరకూ భారీగా తగ్గించింది.

ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తున్నాయి. సామాన్యులకు మరింత చేరువ అవుతున్నాయి. ఇందులో భాగంగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (జీఈఎమ్ పీఎల్)కు చెందిన యాంపియర్ మాగ్నస్, రియో లి ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు బాగా తగ్గాయి. దేశ మార్కెట్ లోకి తన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసిన తర్వాత యాంపియర్ తన పాత మోడళ్లలో కొన్నింటి ధరలు తగ్గించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా రియో లీ ప్లస్, మాగ్నస్ ఎల్‌టీ, మాగ్నస్ ఈఎక్స్ ధరలను రూ.10 వేల వరకూ భారీగా తగ్గించింది.
తగ్గింపు ధరలు..
యాంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎల్ టీ, ఈఎక్స్ అనే రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. డిస్కౌంట్ తర్వాత కొత్త ధరలు రూ. 84,900, రూ.94,900 గా ఉన్నాయి. వాటిలో 60వీ/28ఏహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఏఆర్ఏఐ సర్టిఫైడ్ తో ఒక్కో ఛార్జ్‌కు 84 కిమీ రేంజ్ వస్తుంది. ఈ బండి గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగం పరిగెడుతుంది.
యాంపియర్ రియో లి ప్లస్..
యాంపియర్ రియో లి ప్లస్ ధర కూడా భారీగా తగ్గింది. ఇప్పుడు కేవలం రూ. 59,900 (ఎక్స్-షోరూమ్)కే అందుబాటులో ఉంది. రియో లి ప్లస్ ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. నగరంలో తక్కువ వేగంతో తక్కువ దూరం ప్రయాణించడానికి ఈ స్కూటర్ ను రూపొందించారు. దీనిలో 1.3 కేడబ్ల్యూహెచ్ లిథియం – అయాన్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. దీనిని రిమూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి చార్జింగ్ చేసుకుంటే 70 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. తక్కువ స్పీడ్ ఇ-స్కూటర్ సెగ్మెంట్ పరిధిలోకి రియో లి ప్లస్ వస్తుంది.
మాగ్నస్ ఎక్స్ స్కూటర్ కు డిమాండ్..
మాగ్నస్ ఎక్స్ అత్యధికంగా అమ్ముడవుతోంది. ఓషన్ బ్లూ, గ్లేసియల్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, గెలాక్సీ గ్రే మరియు మెటాలిక్ రెడ్ రంగులలో ఆకట్టుకుంటుది. కేవలం పది సెకన్లలో జీరో నుంచి 40 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది. దీనిలో రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది.
నెక్సస్ ధరల వివరాలు..
యాంపియర్ నెక్సస్ ఈఎక్స్, నెక్సస్ ఎస్ టీ స్కూటర్ల ధరలు రూ. 1.09 లక్షలు, రూ.1.19 లక్షలుగా ఉన్నాయి. వీటి బుక్కింగ్ లను గత నెలలో ప్రారంభించారు. ఈనెల రెండో వారం నంచి డెలివరీలు కూడా మొదలుపెట్టారు. వీటిలో 3 కేడబ్ల్యూహెచ్ ఎల్ ఈపీ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఈ వాహనాలను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 136 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. సుమారు నాలుగు గంటల లోపే పూర్తిగా చార్జింగ్ అవుతుంది. తగ్గింపు ధరలతో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు వాటి కోనుగోలుకు ఆసక్తి చూపుతారు. తద్వారా ఈవీల మార్కెట్ మరింత పురోగతి సాధిస్తుంది. మధ్య తరగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




