AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Multibagger Stock: టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి.. పూర్తి వివరాలు ఇవి..

ఆ స్టాక్‌ పేరు టైటాగఢ్ రైల్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌. దీని షేర్‌ దర గత శుక్రవారం దాదాపు 8 శాతం లాభపడి బీఎస్‌ఈలో 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,308.95కి చేరుకుంది. గత ఏడాది కాలాన్ని ప్రామాణికంగా తీసుకున్నా ఈ మల్టీబ్యాగర్‌ ధర దాదాపు 170శాతానికి పైగా పెరిగింది. రైజింగ్ రైల్వే క్యాపెక్స్ ఎర్నింగ్ ఔట్‌లుక్‌ను ఎత్తివేయడం కూడా ఈ టైటాగఢ్ రైల్ సిస్టమ్స్ షేర్ లాభాలకు దారితీసింది.

Multibagger Stock: టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి.. పూర్తి వివరాలు ఇవి..
Stock Trading
Madhu
|

Updated on: May 20, 2024 | 7:24 AM

Share

స్టాక్‌ మార్కెట్లో ఎప్పుడు ఏ స్టాక్‌ హైక్‌ అవుతుందో.. ఎప్పుడు ఏ స్టాక్‌ కిందికి దిగిపోతుందో అంచనా వేయడం అంత సులువు కాదు. దాని మీద మంచి అవగాహన, నైపుణ్యం ఉన్న వారే కాస్త చెప్పగలుగుతారు. అది కూడా కచ్చితంగా చెప్పలేరు. అయితే ఓ మల్టీబ్యాగర్‌ రైల్వే స్టాక్‌ ఇటీవల 52 వారాల గరిష్టానికి ఎగబాకింది. ఆ స్టాక్‌ పేరు టైటాగఢ్ రైల్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌. దీని షేర్‌ దర గత శుక్రవారం దాదాపు 8 శాతం లాభపడి బీఎస్‌ఈలో 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,308.95కి చేరుకుంది. గత ఏడాది కాలాన్ని ప్రామాణికంగా తీసుకున్నా ఈ మల్టీబ్యాగర్‌ ధర దాదాపు 170శాతానికి పైగా పెరిగింది. రైజింగ్ రైల్వే క్యాపెక్స్ ఎర్నింగ్ ఔట్‌లుక్‌ను ఎత్తివేయడం కూడా ఈ టైటాగఢ్ రైల్ సిస్టమ్స్ షేర్ లాభాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ షేర్‌ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? పెట్టుబడి దారులు దీనివైపు చూడొచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు? తెలుసుకుందాం రండి..

ఇది టైటాగఢ్‌ రైలు సిస్టమ్‌ పరిస్థితి..

2024 ఆర్థిక సంవత్సరానికి, టైటాగఢ్ రైలు సిస్టమ్‌స్‌ లిమిటెడ్‌ రూ. 3,853 కోట్ల ఆదాయం సాధించింది. గతంలో పోల్చితే 38.58 శాతం మెరుగుపడింది. నివేదించింది. 297 కోట్ల నికర లాభం చూపిస్తూ.. 7.71 శాతం వృద్ధి సాధించినట్లు ఓ నివేదికలో స్పష్టం చేసింది. గత 5 సంవత్సరాల్లో, టైటాగఢ్ రైల్ సిస్టమ్స్ ఆదాయం 21.02 శాతం సీఏజీఆర్‌ (కాంపౌండ్‌ యాన్యువుల్‌ గ్రోత్‌, Ebitda 28.50 శాతం సీఏజీఆర్‌), పన్నుకు ముందు లాభం 44.51 శాతం సీఏజీఆర్‌ పెరిగింది. కొత్తగా రూ. 14,750 కోట్ల విలువైన ఆర్డర్ బుకింగ్‌తో గత ఆర్థిక సంవత్సరాన్ని ముగించింది, ప్యాసింజర్ రోలింగ్ స్టాక్ ఈ ఆర్డర్ బుక్‌లో 46 శాతం కలిగి ఉంది. జాయింట్ వెంచర్లలో ఆర్డర్ బుక్ వాటాతో పాటు రూ.13,326 కోట్లుగా ఉంది. భెల్‌తో పాటు వందే భారత్ ఆర్డర్‌లు ఈ ఆర్డర్ బుక్‌లో సగానికి పైగా ఉన్నాయి.అందువల్ల కలిపి ఆర్డర్ బుక్ విలువ దాదాపు రూ. 28000 కోట్లు. కంపెనీ నిర్వహణ పనితీరు ఆరోగ్యంగా ఉందని, ప్రయాణికుల సెగ్మెంట్ ఆదాయాలు పెరగవచ్చని మరో నివేదిక పేర్కొంది. పెరుగుతున్న రైల్వే కాపెక్స్ నుంచి టైటాగఢ్ కూడా ప్రయోజనం పొందవచ్చని సూచిస్తోంది.

ఉత్పత్తి పెరిగింది..

టైటాగఢ్ సిస్టమ్స్‌ వ్యాగన్ విభాగం ఇప్పుడు స్వింగ్‌లో పనిచస్తోంది. మార్చి-24లో 1,089 వ్యాగన్‌లను, 2024 ఆర్థిక సంవత్సరంలో క్వార్టర్‌4లో రూ. 2,700 వ్యాగన్‌లను, ఆర్థిక సంవత్సరం2024లో రూ. 8,400 వ్యాగన్‌లను ఉత్పత్తి చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే 2025 మార్చి నాటికి 950–1,000 వ్యాగన్‌లను ఉత్పత్తి చేయాలని మేనేజ్‌మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే కంపెనీ స్థిరంగా నెలకు 1,000 వ్యాగన్‌లకు ఉత్పత్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఈ నెల ప్రారంభంలో, మోర్గాన్ స్టాన్లీ సంస్థ కూడా బలమైన వృద్ధి అంశాలతో పాటు భారతీయ రైల్వేల పునరుద్ధరణలో టైటాగఢ్‌ను పెద్ద లబ్ధిదారుగా భావించి, రూ. 1,285 లక్ష్య ధరతో స్టాక్‌పై ‘ఓవర్ వెయిట్’ రేటింగ్‌ను ప్రారంభించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..